Fenugreek Water: ఇప్పటి కాలంలో మధుమేహం సమస్య వేగంగా పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, ఒత్తిడి కారణంగా ఈ వ్యాధి ప్రతి ఇంటిలో ఒకరిని ప్రభావితం చేస్తోంది. డయాబెటిస్ పూర్తిగా నయం కాదన్న భావన ఉన్నా కొన్ని సహజమైన మార్గాలతో దీన్ని నియంత్రించవచ్చు. అటువంటి సహజ చికిత్సలలో మెంతులు ఎంతో ముఖ్యమైనవి. ఇవి మన ఇంట్లోనే సులభంగా దొరికే సాధారణ గింజలే అయినా శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. మెంతుల రుచి కొంచెం చేదుగా అనిపించినా ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే తప్పనిసరిగా మన జీవనశైలిలో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు.
మధుమేహం ఉపశమనం:
ముఖ్యంగా మెంతులను రాత్రికి రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా టైప్ 2 మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మెంతులలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్, రాగి, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, బి1, బి2, బి3, బి6, ఫోలేట్ వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మెంతుల నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో మెంతి నీరు సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: గర్భిణులు మొదటి మూడు నెలల్లో ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి
ఇది కాలేయ ఆరోగ్యానికి, గుండెకు మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా మధుమేహ ప్రభావాన్ని తగ్గించగలదు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల మెంతులు వేసి నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం లేవగానే వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. మీరు మెంతి గింజలను తినాలనుకుంటే కూడా తినొచ్చు. ఇది శరీరానికి ఫైబర్ అందిస్తూ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ విధంగా రోజూ పాటిస్తే మధుమేహ నియంత్రణలో ఉండటం కాకుండా శరీరానికి శక్తిని ఇస్తుంది. సహజంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గంలో ఇది ఒక చక్కటి పరిష్కారం అని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: టమోటాలు ఇలా వాడారంటే జుట్టు వద్దన్నా పెరుగుతుంది
( fenugreek-water | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )