Bathukamma: ఐదో రోజు అట్ల బతుకమ్మ..విశిష్ఠతలు ఇవే! అట్ల బతుకమ్మ రోజు బియ్యంతో చేసిన అట్లు అమ్మవారికి నైవేద్యంగా ఉంచుతారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా మరపట్టించి పిండిగా చేసి అట్లు పోస్తారు. అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ముత్తైదువులకు వాయనంగా ఇస్తారు. By Vijaya Nimma 05 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Bathukamma షేర్ చేయండి Bathukamma: బతుకు తీరును నేర్పే పండుగ బతుకమ్మ.. బతుకు అమ్మా అంటూ ఆడబిడ్డలను ఆశీర్వదించే సాంప్రదాయం ఇది. బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో గాధలున్నా పండగలో ప్రధాన పాత్ర పువ్వులదే. ఇప్పటికే నాలుగు రోజుల వేడుకలు ముగిశాయి. ఐదో రోజు నిర్వహించేది అట్ల బతుకమ్మ. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ అని, రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నానే బియ్యం బతుకమ్మను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఒక్కోరోజు ఒక్కో రకం ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తల్లిని కొలుస్తారు. ప్రత్యేక పళ్లెంలో భారీ బతుకమ్మ: అట్ల బతుకమ్మ రోజు బియ్యంతో చేసిన అట్లు అమ్మవారికి నైవేద్యంగా ఉంచుతారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా మర పట్టించి పిండిగా చేసి అట్లు పోస్తారు. అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ముత్తైదువులకు వాయనంగా ఇస్తారు. అట్ల బతుకమ్మ రోజు తంగేడు, గునుగు, చామంతి, గుమ్మడి పూలతో బతుకమ్మలను తయారు చేస్తారు. ఐదోరోజు ఐదు అంతరాల్లో అంటే ఐదు అంతస్తులుగా బతుకమ్మను తయారు చేస్తారు. ఆరో రోజు మినహా తొలి 7 రోజులు మట్టి లేదా పసుపుతో బొడ్డెమ్మ అంటే గౌరమ్మను తయారు చేస్తారు. ఇది కూడా చదవండి: ఈ కాయలు తింటే మధుమేహం దరిచేరదు రోజుకో నైవేద్యం చొప్పున సమర్పిస్తారు. పండుగ చివరి రోజున సద్దుల బతుకమ్మ.. ప్రత్యేక పళ్లెంలో భారీ బతుకమ్మలను పేరుస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఆడిపాడతారు. చప్పట్లు కొడుతూ బతుకమ్మను ఆరాధిస్తారు. తర్వాత చెరువు లేదా నదిలో బతుకమ్మలను కలిపి గంగమ్మకు హారతి ఇచ్చి ఇంటికి చేరుకుంటారు. ప్రసాదాలు పంచి ఆ రోజుకి వేడుక ముగిస్తారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: ఇలా చేశారంటే ముక్కు కారడం వెంటనే ఆగిపోతుంది #Bathukamma 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి