లివర్ క్లీన్ అవ్వాలంటే వీటిని క్రమం తప్పకుండా తినండి..! By Shareef Pasha 25 Jun 2023 in లైఫ్ స్టైల్ Scrolling New Update షేర్ చేయండి ఆయుర్వేదంలో శరీరానికి ఉపయోగపడే ఎన్నో వనమూలికలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఓ రెండు మూలికల గురించి తెలుసుకుందాం. శక్తిని పెంచి, జీర్ణవ్యవస్థని సరిచేసి అనేక సమస్యల్ని దూరం చేసేందుకు ఆయుర్వేదంలో చాలా మూలికలు ఉన్నాయి. ఈ విధంగానే వేప, పసుపు కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వేప, పసుపుని కలిపి ఎలా తీసుకోవాలో చూద్దాం. వేప పొడి - పావు టీ స్పూన్ పసుపు 3 చిటికెలు తేనె కొద్దిగా.. వేప పొడి, పసుపు, కొద్దిగా తేనె లేదా నీరు కలపండి. వీటిని చిన్న చిన్న గోళిల్లా తయారు చేయండి. వీటిని మీరు ఉదయాన్నే పరగడపున తినొచ్చు. యోగా, ధ్యానం చేసేముందు వీటిని తీసుకోవచ్చు. ఆయుర్వేద వైద్య నిపుణుల సలహాతో కొన్ని రోజులు, వారానికి రెండు మూడు సార్లు తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల కొంతమందికి త్వరగా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. కొంతమందికి కొన్ని రోజులు పట్టొచ్చు. వీటి వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. జీర్ణ సమస్యలు.. వేప, పసుపు రెండూ జీర్ణశయాన్ని క్లీన్ చేస్తాయి. పోషకాలను గ్రహించడంలో సాయపడతాయి. డీహైడ్రేట్ కాకుండా చూస్తాయి. ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. దీనిని తీసుకోవడం వల్ల శక్తిని పెంచుకోవచ్చు. వేప, పసుపు కలిపి ఉదయాన్నే తీసుకుంటే కణాల్లోని శక్తి కేంద్రాలు మేల్కొంటాయి. ఇవి సహజమైన శక్తిని అందిస్తాయి. లివర్‌ని క్లీన్ చేస్తాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేసేటప్పుడు విషపూరిత శరీర భారాన్ని తగ్గిస్తుంది. శక్తిని కూడా పెంచుతుంది. అవాంఛిత సూక్ష్మక్రిములు, వ్యాధికారక క్రిములు మొదలైన వాటికి వ్యతిరకంగా శరీర సహజ రక్షణని పెంచడంలో సాయం చేస్తుంది. శుభ్రమైన జీర్ణమవ్యవస్థకి హెల్ప్ చేస్తుంది. విరోచనాలు, తరచుగా వచ్చే జలుబు, దగ్గు, చర్మ సమస్యలకి సాయపడుతుంది. రక్తాన్ని బలపరుస్తుంది. జీర్ణ వ్యవస్థని శుభ్రపరచడానికి జీవక్రియని పెంచుతుంది. కీళ్ళ కదలికను పెంచుతుంది. వేసవికాలం వేప, పసుపు రెండింటిని కలిపి తాగితే శరీరానికి మేలు.. వేపతో లాభాలు.. హెల్దీ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేస్తుంది.పేగులోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవికి మేలు చేస్తుంది.ఇది చర్మ, నోటి మైక్రోఫ్లోరాకి మంచిదని చెబుతున్నారు. ఇమ్యూనిటీని పెంచుతుంది.వేపలో డిస్ముటేస్, గ్లూటాతియెన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేస్తుంది. జీవక్రియకి హెల్ప్ చేస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది. పసుపుతో లాభాలు.. పసుపులోని కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గిస్తుంది. సహజ నొప్పి నివారణగా ఇది పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. డీటాక్సీ ఫై చేస్తుంది. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి