Lemon : నిమ్మకాయ అతిగా తీసుకుంటున్నారా..? జాగ్రత్త వేసవి కాలంలో నిమ్మకాయ దాని ఉత్పత్తుల వినియోగం మరింత పెరుగుతుంది. అయితే నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు. నిమ్మకాయ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 19 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Taking Too Much Lemon : వేసవి (Summer) లో నిమ్మకాయ వినియోగం పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు (Health Benefits) చేస్తుంది. అనేక సమస్యలను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. అయితే నిమ్మకాయ ఎక్కువగా తినడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు. నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు డీహైడ్రేషన్ సమస్య ఉండవచ్చు నిమ్మకాయ శరీరం నుంచి టాక్షిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది. కానీ, నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. కడుపు సంబంధిత సమస్యలు ఖాళీ కడుపుతో నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతారు. అయితే, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అంతేకాదు జీర్ణక్రియను కూడా తగ్గిస్తుంది. చర్మం పొడిబారడం నిమ్మకాయ (Lemon) చర్మం పొడిబారడానికి కారణమవుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు తినవచ్చు. డ్రై స్కిన్ ఉన్నవారు లెమన్ వాటర్ ను రెగ్యులర్ గా తాగుతూ ఉంటే, అది చర్మం మరింత పొడిబారడానికి కారణం అవుతుంది. గొంతునొప్పి నిమ్మకాయ ఎక్కువగా తీసుకుంటే గొంతుకు హాని కలుగుతుంది. నిమ్మరసం చికాకు, గొంతు నొప్పిని కలిగిస్తుంది. ఇది గొంతును ప్రభావితం చేసే సిట్రిక్ యాసిడ్ ను కలిగి ఉంటుంది. దీని కారణంగా, గొంతు నొప్పి, వాపు సమస్య రావచ్చు. దంతాలకు హానికరం నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది. కావున దీనిని పదే పదే తినడం వల్ల మీ దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. నిమ్మరసం తాగిన వెంటనే పళ్ళు తోముకోవడం కూడా మానుకోవాలి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Kalki 2898 AD : ప్రభాస్ 'బుజ్జి' మామూలుగా లేదుగా.. ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు..! - Rtvlive.com #summer #lemon-health-effects #antioxidants మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి