Cholesterol Test : కొలెస్ట్రాల్ టెస్ట్ కు వెళ్లేముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. జాగ్రత్త..!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని సరిగ్గా ఉంచడం చాలా ముఖ్యం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్లయితే, దాని పరీక్షకు వెళ్లే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
Cholesterol Test : కొలెస్ట్రాల్ టెస్ట్ కు వెళ్లేముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. జాగ్రత్త..!

Heart Health : గుండె ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డిఎల్(LDL) పెరిగినప్పుడు నాళాలలోకి రక్త ప్రసరణ మందగిస్తుంది. దీని కారణంగా గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయదు, అది మొత్తం శరీరానికి చేరుకోవడంలో ఆలస్యం అవుతుంది. ఫలితంగా రక్తంతో పాటు ఆక్సిజన్ సకాలంలో శరీరానికి అందదు. దీని వల్ల ఇతర శరీర భాగాల పనితీరు కూడా దెబ్బతింటుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల కలిగే సమస్యలను నివారించడానికి, వైద్యులు మొదట లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్(Lipid Profile Test) అని పిలిచే కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేస్తారు. అయితే మీరు ఈ పరీక్షను పూర్తి చేయాలనుకుంటే, ఈ విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తప్పుగా సూచించబడే ప్రమాదం ఉంటుంది.

కొలెస్ట్రాల్ పరీక్ష లేదా లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకునే ముందు ఈ జాగ్రత్తలు వహించండి

ఆల్కహాల్ 

మీరు కొలెస్ట్రాల్ పరీక్ష(Cholesterol Test) చేయించుకోవడానికి వెళ్ళినప్పుడల్లా, మీరు 10-12 గంటల ముందు ఎలాంటి ఆహరం తినకుండా ఉండాలని గుర్తుంచుకోండి. నీళ్లు మాత్రమే తాగాలి. గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయం తాగడం కూడా కొలెస్ట్రాల్ పరీక్షలలో తప్పుడు ఫలితాలను ఇస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ పరీక్షకు 48 గంటల ముందు ఆల్కహాల్
తీసుకోవద్దు. ఆల్కహాల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా 

కొలెస్ట్రాల్ టెస్ట్ కు వెళ్లే 48 గంటల ముందు కొవ్వు లేదా నూనెతో కూడిన ఆహారాన్ని తినడం మానేయండి. కొవ్వు, జిడ్డుగల ఆహారాలు మీ లిపిడ్ పరీక్ష సంఖ్యలను కూడా తప్పుగా సూచిస్తాయి. హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. పుష్కలంగా నీరు త్రాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ తప్పుగా సూచించవు.

ఒత్తిడికి దూరంగా 

కొలెస్ట్రాల్ పరీక్ష కోసం వెళుతున్నట్లయితే, మీ మనస్సును రిలాక్స్ చేయండి , చాలా ఒత్తిడితో కూడిన పనికి దూరంగా ఉండండి. కోపం, అధిక పని వంటి వాటి వల్ల అలసిపోయినట్లు లేదా చాలా ఒత్తిడికి లోనవుతారు. ముందుగా మీ మనస్సును రిలాక్స్ చేసుకోండి. తర్వాత 48 గంటల్లో కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే ఒత్తిడి కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది.

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: World Malaria Day: నేడు మలేరియా ప్రపంచ దినోత్సవం.. అసలు ఈరోజును ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

నోయిడాలోని సెక్టార్ 168లో ఉన్న ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. అది కాస్త జుట్లు పట్టుకునే వరకు దారి తీసింది. ఒక మహిళ వేరొక మహిళ తల్లిని తిట్టిందని జుట్టు పట్టుకుని కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

New Update
noida woman grabs another by hair pins her down viral video

noida woman grabs another by hair pins her down viral video Photograph: (noida woman grabs another by hair pins her down viral video)

నోయిడాలోని ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన వ్యక్తిగత వివాదం తీవ్రతరమైంది. దాని ఫలితం దారుణమైన దాడికి దారితీసింది. ఓ మహిళ వేరొక మహిళ జుట్టు పట్టుకుని రప్పా రప్పా కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా మహిళలు గొడవ పడితే.. అది ఎంతవరకు అయినా దారి తీస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అది నడి రోడ్డు అని కూడా చూడరు. అయ్యో అందరూ ఉన్నారులే అని సైలెంట్‌గా ఉండరు. ఎవరుంటే మాకేంటి అన్నట్లు జుట్లు పట్టుకుని బాదుకుంటారు. తాజాగా అలాంటిదే నొయిడాలో జరిగింది. 

ఏం జరిగిందంటే?

సెక్టార్ 168లో ఉన్న నోయిడా సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు ఘోరంగా.. అతి దారుణంగా తిట్టుకున్నారు. అది కాస్త తిట్లతో ఆగకుండా కొట్లాట వరకు వెళ్లింది. ఆ ఇద్దరు మహిళలు ఒకే కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. వారిద్దరికీ మంచి పరిచయం ఉంది. ఒకరోజు వీరిద్దరిలో ఒక మహిళ వేరొక మహిళ తల్లిపై అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడింది. అలా మాటల యుద్ధం సాగిన తర్వాత చల్లబడ్డారు. 

కానీ ఒకే దగ్గర ఉండటంతో.. మరుసటి రోజు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వారి వివాదం మరింత దారుణంగా మారింది. ఒక మహిళ మరొక మహిళ జుట్టు పట్టుకుని వదలకుండా కొట్టింది. పక్కనే ఉన్నవారు విడిపించాలని చూసినా ఆమె జుట్టు వదల్లేదు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

(viral-news | viral-video | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment