Life Style : మీ వ్యక్తిత్వం ఏంటో మీ చేతి వేళ్ళే చెబుతాయి..! మరి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి..?

ఒక చేతి వేళ్ళు అతని స్వభావం, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని చెబుతారు. పొడవైన ఉంగరపు వేలు కలిగిన వారు అన్ని రకాల రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు చిన్నగా ఉన్న వ్యక్తులు ఇతర వ్యక్తుల నుంచి ప్రశంసలను వినడానికి ఇష్టపడతారు.

New Update
Life Style : మీ వ్యక్తిత్వం ఏంటో మీ చేతి వేళ్ళే చెబుతాయి..! మరి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి..?

Finger Personality Prediction : ఒక వ్యక్తిని అతని డ్రెస్సింగ్ (Dressing), మాట్లాడే విధానం (Speaking Manner)  ద్వారా వారు ఎలాంటి వారో గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి చేతిలోని వేళ్లు కూడా అతని వ్యక్తిత్వం గురించి చాలా చెబుతాయని నిపుణులు చెబుతారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం..? అతని స్వభావం..? అతని వేళ్లను చూసి సులభంగా తెలుసుకోవచ్చు. చేతి వేళ్ళ ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా గుర్తించబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాము..

పొడవైన ఉంగరపు వేలు

ఉంగరపు వేలు (Ring Finger) అంటే ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉన్న వ్యక్తులు ఆకర్షణీయంగా ఉంటారు. చాలా కోపంగా కూడా ఉంటారు. ఈ వ్యక్తులు అన్ని రకాల రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు తమ వృత్తి జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు. మల్టీ టాలెంటెడ్‌గా ఉండటమే కాకుండా, ఈ వ్యక్తులు మనస్సులో కూడా చాలా పదునుగా ఉంటారు.

ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే చిన్నగా

ఒక వ్యక్తి ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే చిన్నగా ఉంటే వారిలో ఆత్మవిశ్వాసం ఉండదని నమ్ముతారు. అయితే ఈ వ్యక్తులు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండటానికి ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తులు ఇతర వ్యక్తుల నుంచి ప్రశంసలను వినడానికి ఇష్టపడతారు.

ఉంగరపు వేలు, చూపుడు వేలు సమానం

ఉంగరపు వేలు, చూపుడు వేలు పొడవు దాదాపు సమానంగా ఉన్న వ్యక్తులు శాంతిని ఇష్టపడే స్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఎలాంటి వాగ్వాదానికి దిగడం లేదా గొడవలో భాగం కావడానికి ఇష్టపడరు.

ఉంగరపు వేలు మధ్యవేలు కంటే పెద్దగా

మధ్య వేలు కంటే ఉంగరపు వేలు పెద్దగా ఉన్న వ్యక్తులు రిస్క్ తీసుకోవడానికి భయపడరు.

బొటనవేలు సాధారణ పరిమాణం కంటే పొడవుగా

బొటనవేలు సాధారణ పరిమాణం కంటే పొడవుగా ఉంటే, మీలో నాయకుడి లక్షణాలు ఉన్నాయని అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యక్తులు నిర్ణయాత్మకంగా, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Also Read: Obesity: బ్రేక్ అప్ కూడా బరువు పెరగడానికి కారణమని మీకు తెలుసా..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు