Revanth Reddy:ఇలాంటి పాలన పై “తిరగబడదాం - తరిమికొడదాం”.. రేవంత్ రెడ్డి!! టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై మరోసారి మండిపడ్డారు. విశ్వనగరంగా చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్.. బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్ పేటలో ఆడబిడ్డల పై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని… ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.. By P. Sonika Chandra 22 Aug 2023 in రాజకీయాలు New Update షేర్ చేయండి Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై మరోసారి మండిపడ్డారు. విశ్వనగరంగా చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్.. బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్ పేటలో ఆడబిడ్డల పై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని… ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి పాలన పై “తిరగబడదాం - తరిమికొడదాం”..! తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయన్న కేసీఆర్... పేదల సంక్షేమాన్ని మరిచారన్నారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు అని ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన రైతు వ్యతిరేకి కేసీఆర్ అని ఆయన మండిప్డడారు. కేసీఆర్ సీఎం అయ్యాక 88వేల మంది రైతులు చనిపోయారన్నారు. దళితులకు భూములు పంచింది, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే అన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారని.. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుందన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ చుట్టూ పదివేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని.. ప్రశ్నించిన వారిపైకి పోలీసులను పంపుతున్నారన్నారు రేవంత్ రెడ్డి. పావలా వడ్డీ, బంగారు తల్లి పథకాలను అటకెక్కించారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే..! కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రూ.4వేలు పెన్షన్ ఇచ్చి తీరుతామన్నారు. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని.. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు సాయం అందిస్తామన్నారు. Also Read: కేసీఆర్ రెండు చోట్ల పోటీచేయడానికి కారణాలేంటి.. వ్యూహమా? భయమా? #revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి