/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/MLA-Kaushik-Reddy.jpg)
MLA Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి లీగల్ నోటీసులు అందాయి. ప్లైయాష్‌పై నిరాధార ఆరోపణలు చేశారని లీగల్ నోటీసు పంపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్టీపీసీ బూడిదను మంత్రి పొన్నం అమ్ముకుంటున్నారని.. లారీలను ఆపి ఆరోపణలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఓవర్ లోడ్‌కు మంత్రి డబ్బులు వసూలు చేశారని విమర్శలు చేశారు. ఎన్టీపీసీ నుంచి ప్లైయాష్ ఉచితంగా సరఫరా చేస్తారు. టెండర్ల పక్రియ ద్వారానే ఉచిత సరఫరా జరగనుంది. రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీకి ప్లైయాష్ ఉపయోగిస్తారు.