/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/farmers-2-1.jpg)
Ananthapuram Farmers: అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా అతివృష్టి అనావృష్టి వల్ల అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పుల ఊబిలో కురుకుపోయమన్నారు. నాలుగు సంవత్సరాలలో 250 మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. అయితే, ప్రస్తుతం బ్యాంకుల అధికారులు పంట రుణాలు చెల్లించమని నోటీసులు ఇచ్చి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోతున్నారు.