Sukhdev Singh Murder: సుఖ్‌దేవ్ సింగ్‌ను చంపింది నేనే: సోషల్ మీడియాలో గ్యాంగ్ స్టర్ పోస్టు రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన రోహిత్ గోదారా అనే వ్యక్తి ఈ హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. By Naren Kumar 06 Dec 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Sukhdev Singh Murder: దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన రోహిత్ గోదారా అనే వ్యక్తి ఈ హత్యకు తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. తమ శత్రువులకు సహకరిస్తున్నందునే సుఖ్‌దేవ్‌ను అంతమొందించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కూడా చదవండి: కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ ను కాల్చి చంపిన దుండగులు అంతేకాకుండా ఇంటి గుమ్మం ఎదుటే శవపేటికల్ని సిద్ధం చేసుకోండంటూ పోస్టులో శత్రువులను తీవ్రస్వరంతో హెచ్చరించాడు. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సుఖ్‌దేవ్‌సింగ్ హత్యకేసులో నిందితుల్ని తాము గుర్తించామని జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ వెల్లడించారు. ఆనంద్‌పాల్ ఎన్‌కౌంటర్ కేసు తర్వాత గోగమేడి తొలిసారి వెలుగులోకి వచ్చారు. ఆ సమయంలో ఆనందపాల్ మృతదేహానికి సంబంధించి చాలా రోజుల పాటు ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత గోగమేడి పేరు చాలా చర్చలోకి వచ్చింది. పద్మావతి సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన సెట్స్‌లో చెప్పుతో కొట్టడంతో సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి మరోసారి వెలుగులోకి వచ్చారు. పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆయన పోరాటాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా దానిపై నిరసన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా నిర్మాత చిత్రం పేరును పద్మావత్‌గా మార్చవలసి వచ్చింది. దాని నుంచి అనేక సన్నివేశాలను కూడా తొలగించాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: ఈవీఎంలపై ఎక్స్‌లో దిగ్విజయ్ బాణాలు.. దుమారం రేపుతున్న పోస్టులు కొన్నేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సుఖ్‌దేవ్ సింగ్ గొడవలు పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. సుఖదేవ్ సింగ్‌ను చంపుతామంటూ గతంలో లారెన్స్ విష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సంపత్ నెహ్రూ నుంచి పోలీసులకు బెదరింపు కాల్స్ వచ్చాయని తెలుస్తోంది. సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడిని ఆగంతకులు కాల్చిచంపడంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. #crime-news #sukhdev-singh-murder మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి