Telangana Municipal Election Results🔴LIVE: మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం.. పార్టీల వారీగా గెలిచిన స్థానాలివే

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సాగుతోంది. గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కౌంటింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!

author-image
By Lok Prakash
New Update
Telangana Municipal Election Results

Telangana Municipal Election Results

Telangana Municipal Election Results

Telangana Municipal Election Results: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. బుధవారం పోలింగ్ పూర్తయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 73.01 శాతం ఓటింగ్ నమోదైంది.

పోలింగ్ శాతం వివరాలు

ఫిబ్రవరి 11న ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 11.6 శాతం ఓటింగ్ జరిగింది. ఉదయం 11 గంటల వరకు 28.48 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 48.54 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 62.09 శాతం ఓటింగ్ నమోదైంది. చివరకు పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 73.01 శాతం ఓట్లు నమోదయ్యాయి.

ఈ ఎన్నికలు అన్ని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పార్టీ ఆధారంగా జరిగాయి. ఎన్నికల జాబితా సరిచేయడానికి ముందుగా 29,656 మంది బూత్ లెవల్ అధికారులు పని చేశారు.

ప్రధాన నేతల ఓటింగ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారం బాద్ జిల్లా కొడంగల్‌లో తన ఓటు హక్కును వినియోగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో ఓటు వేశారు.

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.

ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చాలా ముఖ్యమైనవి. ఈ ఫలితాల ద్వారా ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అందుకే అన్ని పార్టీలు ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఓట్ల లెక్కింపుపై ఉంది. తుది ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు ఎలా ఉంటాయో చూడాలి.

  • Feb 13, 2026 20:15 IST

    మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం.. పార్టీల వారీగా గెలిచిన స్థానాలివే

    • మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.
    • 116 స్థానాలకు గానూ 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం ఢంకా మోగించింది.
    • 13 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ గెలుపొందింది.
    • 38 మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది.
    • వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్‌ బ్లాక్‌ దక్కించుకుంది
    • వార్డుల వారీగా చూస్తే, 2582 వార్డుల్లో సగానికిపైగా కాంగ్రెస్‌కే దక్కాయి
    • కాంగ్రెస్‌ - 1347
    • బీఆర్‌ఎస్‌ - 717
    • భాజపా - 261
    • ఇతరులు - 256
    • నారాయణ్‌పేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీ 6వ వార్డు భాజపా అభ్యర్థి కన్నుమూయడంతో ఎన్నిక జరగలేదు.



  • Feb 13, 2026 20:14 IST

    కరీంనగర్‌లో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం

    • కరీంనగర్‌లో మొత్తం 66 డివిజన్లలో భాజపా 30 చోట్ల విజయం
    • బీఆర్‌ఎస్‌ 9 డివిజన్లలో విజయం
    • కాంగ్రెస్‌ 14, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 2 డివిజన్లలో గెలుపు



  • Feb 13, 2026 20:14 IST

    అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు: సీఎం రేవంత్‌

    revanth

    • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన శ్రేణులకు ఈ విజయం అంకితం.
    • రెండేళ్ల పాలన, అభివృద్ధిని చూసి ప్రజలు సంపూర్ణ తీర్పు ఇచ్చారు.
    • కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్‌ జెండాను మోశారు.
    • ఈ విజయం లక్షలాది కాంగ్రెస్‌ కార్యకర్తలది
    • భవిష్యత్‌లో పురపాలక సంస్థలను గొప్పగా అభివృద్ధి చేస్తాం
    • ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి



  • Feb 13, 2026 19:54 IST

    ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పందించారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని తెలిపారు. ఇప్పటిదాక వెలువడిన ఫలితాల్లో 250 వార్డుల్లో గెలిచామన్నారు

    Telangana BJP Chief ram chander rao
    Telangana BJP Chief ram chander rao



  • Feb 13, 2026 19:53 IST

    BRS : పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ఘోర పరాజయం.. సింగిల్ డిజిట్ కే పరిమితం

    పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రంలో భారీగా మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో పలుజిల్లాల్లో పూర్తిగా సతికిల పడింది. కాగా పెద్దపల్లి జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉండగా ఏ ఒక్కదానిలోనూ విజయం సాధించలేకపోయింది.

    FotoJet (5)



  • Feb 13, 2026 18:51 IST

    ఖాతా తెరవని బీజేపీ

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 45 మున్సిపాలిటీల్లో సున్నా స్థానాలతో అసలు ఖాతా తెరవని బీజేపీ



  • Feb 13, 2026 18:30 IST

    మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం..

    మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంపై కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంబురాల్లో పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
    ✍️ది.13.02.2026 మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారు అధ్వర్యంలో నిర్వహించిన సంబురాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు..అనంతరం కేక్ కట్ చేసి గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు..

    Congress Party Winning Celebrations



  • Feb 13, 2026 18:19 IST

    గెలిచిన అభ్యర్థులను క్యాంపునకు తరలిస్తున్న బీఆర్‌ఎస్‌

    • వర్ధన్నపేట మున్సిపల్‌ ఫలితాలు వెలువడ్డాయి
    • 12 స్థానాలకు గానూ బీఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌ 5, ఇతరులు 1 చోట విజయం
    • గెలిచిన ఆరుగురు అభ్యర్థులను క్యాంపునకు తరలిస్తున్న బీఆర్‌ఎస్‌



  • Feb 13, 2026 18:18 IST

    ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపాలిటీ ఫలితాలు పూర్తి

    • ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలు 19
    • బీఆర్‌ఎస్‌: తూప్రాన్, గడ్డపోతారం, దుబ్బాక, చేర్యాల, గుమ్మడిదల, గజ్వేల్
    • కాంగ్రెస్ : సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్ -జోగిపేట, నారాయణఖేడ్, రామాయంపేట, హుస్నాబాద్
    • హాంగ్: జహీరాబాద్, ఇస్నాపూర్, కోహిర్, ఇంద్రేశం, జిన్నారం, మెదక్, నర్సాపూర్.



  • Feb 13, 2026 17:57 IST

    చక్రం తిప్పిన గూడెం మహిపాల్ రెడ్డి.. ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ హవా

    బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపాల్ ఎన్నికల ముందు తిరిగి బీఆర్ఎస్ వైపుమళ్లిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చక్రం తిప్పడం వల్ల బీఆర్ఎస్ ఘననీయమైన విజయాల్ని సొంతం చేసుకుంది.



  • Feb 13, 2026 17:34 IST

    భాజపాను ఓడించేందుకు మూడు పార్టీలు కలిశాయి

    • భాజపాను ఓడించేందుకు ఎంఐఎం, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయి.
    • మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపాకు ఓట్ల శాతం పెరిగింది
    • దాదాపు 350 వార్డుల్లో గెలుస్తున్నాం
    • మజ్లిస్‌ ఓటు పడకపోతే, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఇన్ని సీట్లు రావు
    • పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు



  • Feb 13, 2026 17:33 IST

    వారిని ఎదుర్కొనేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారు: కేటీఆర్‌

    • కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొంటాం
    • భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తాం
    • హంగ్‌ మున్సిపాలిటీలు ఎవరికి దక్కుతాయో చూడాలి
    • పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు: కేటీఆర్‌



  • Feb 13, 2026 17:33 IST

    కలిసొచ్చే తటస్థులను కలుపుకొని పోయేందుకు సిద్ధం: కేటీఆర్‌

    • హంగ్‌ వచ్చిన చోట కాంగ్రెస్‌ పార్టీ మరింత అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది.
    • మున్సిపల్‌ పీఠాల కైవసానికి కాంగ్రెస్‌ అప్పుడే బేరసారాలు, కొనుగోళ్లు మొదలు పెట్టింది.
    • కాంగ్రెస్‌, భాజపా కుమ్మక్కు అయ్యాయి.
    • కేసీఆర్‌ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అటు పల్లె, ఇటు పట్టణాల్లో ప్రజలు తేల్చారు.
    • హైదరాబాద్‌ సహా ఇతర కార్పొరేషన్‌లలో ఇదే ఉత్సాహంతో ముందుకు పోతాం: కేటీఆర్‌



  • Feb 13, 2026 17:33 IST

    మున్సిపల్‌ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం: కేటీఆర్‌

    • మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మెరుగైన ఫలితాలు సాధించాం
    • నేరుగా దాదాపు 15-16 మున్సిపాలిటీల్లో గెలిస్తే, మరో 15-16 చోట్ల అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచాం.
    • 750 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించిందిజ
    • దాదాపు 30శాతం మున్సిపాలిటీలు గెలుస్తున్నాం.
    • కాంగ్రెస్‌ పార్టీ భారీగా అక్రమాలు, అవినీతికి పాల్పడింది.
    • బీఆర్‌ఎస్‌ శ్రేణులు వీరోచితంగా పోరాటం చేశారు.



  • Feb 13, 2026 17:33 IST

    60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే విజయం

    • తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతోంది.
    • 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు జరగ్గా, సగంపైగా వార్డుల్లో కాంగ్రెస్‌ గెలిచింది.
    • మొత్తం మున్సిపాలిటీలు -116
    • కాంగ్రెస్‌ - 60
    • బీఆర్‌ఎస్‌ - 12
    • భాజపా - 0
    • ఇతరులు - 1
    • హంగ్‌ - 34
    • ఫలితం రావాల్సినవి - 9



  • Feb 13, 2026 17:13 IST

    చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డులకు గాను 10 వార్డులలో గెలుపొందిన

    చొప్పదండి మున్సిపాలిటీలో 14 వార్డులకు గాను 10 వార్డులలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు  ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ చొప్పదండి శాసన సభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా శ్రీ మేడిపల్లి సత్యం గారు

    Congress Party Members



  • Feb 13, 2026 16:38 IST

    బిగ్ బ్రేకింగ్ న్యూస్

    గజ్వేల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం 

    మొత్తం వార్డులు – 14 
    బీఆర్ఎస్ – 8
    కాంగ్రెస్ – 5
    బీజేపీ – 1



  • Feb 13, 2026 16:37 IST

    BIG BREAKING 🎯

    ఉమ్మడి మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ ప్రభంజనం
    17 మున్సిపాలిటీలకు గాను 12 కైవసం చేసుకున్న గులాబీ జెండా
    ఎన్నిక ఏదైనా మెదక్ బిఆర్ఎస్ అడ్డా అని మరోసారి నిరూపించిన ఓటర్లు
    అన్నీ తానై ఒంటి చేత్తో మెజార్టీ స్థానాల్లో పార్టీని గెలిపించిన హరీష్ రావు



  • Feb 13, 2026 16:31 IST

    చేర్యాలలో సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబుల్ భార్య ఘన విజయం

    సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిపై 223 ఓట్ల మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గీతాంజలి
    గీతాంజలి బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తుండడంతో ప్రచారం చేస్తున్నాడని ఆమె భర్తను పోలీస్ కానిస్టేబుల్ విధుల నుండి సస్పెండ్ చేసిన అధికారులు
    ఈరోజు వెలువడిన ఫలితాల్లో ఘన విజయం సాధించిన గీతాంజలి

    Geetanjali



  • Feb 13, 2026 16:30 IST

    ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ...

    మున్సిప‌ల్  ఎన్నిక‌ల్లో గెలుపుపై సీఎంకు ప్రియాంక అభినంద‌న‌లు

    ఢిల్లీ:  ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో  ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పైన చ‌ర్చ జ‌రిగింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డంపై ప్రియాంక గాంధీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆమె ప్ర‌త్యేక్యంగా అభినందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ఘ‌న విజ‌యం క‌ట్ట‌బెట్టార‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి తెలియ‌జేశారు.

    Revanth Reddy - Priyanka Gandhi



  • Feb 13, 2026 16:20 IST

    ఆదిలాబాద్‌.. అత్యధిక వార్డుల్లో భాజపా విజయం

    • 49 వార్డులకు గానూ 21 వార్డుల్లో విజయం సాధించిన భాజపా
    • కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ 6, ఇతరులు 11 వార్డుల్లో గెలుపు



  • Feb 13, 2026 16:19 IST

    మంచిర్యాల కార్పొరేషన్ 34వ డివిజన్



  • Feb 13, 2026 16:06 IST

    నిర్మల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

    భైంసా మున్సిపల్ పీఠం దక్కించుకున్న MIM!

    భైంసా మున్సిపాలిటీ ఫలితాలు..

    మొత్తం 26 స్థానాలు కాగా..

    19 వార్డు స్థానాలు గెలిచిన ఎంఐఎం అభ్యర్థులు

    5 వార్డు స్థానాలు గెలిచిన బీజేపీ అభ్యర్థులు

    1 వార్డు స్థానం గెలిచిన కాంగ్రెస్



  • Feb 13, 2026 16:05 IST

    గజ్వేల్ మున్సిపాలిటీ

    బ్రేకింగ్ న్యూస్ 

    మరో మున్సిపాలిటీ దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ 

    గజ్వేల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం

    మొత్తం 14 వార్డులకు గాను 8 వార్డులు బీఆర్ఎస్, 5 వార్డులు కాంగ్రెస్, 1 వార్డు బీజేపీ అభ్యర్థుల గెలుపు



  • Feb 13, 2026 16:03 IST

    2 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం

    • నాగర్‌కర్నూల్‌లో రీకౌంటింగ్‌లో తేలిన 12వ వార్డు ఫలితం
    • 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జయలక్ష్మి 2 ఓట్ల తేడాతో విజయం
    • తొలి కౌంటింగ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 3 ఓట్ల ఆధిక్యం



  • Feb 13, 2026 16:02 IST

    జగిత్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థుల హవా

    • మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 12, భాజపా 4, బీఆర్‌ఎస్‌ 4 వార్డుల్లో విజయం
    • 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం, 2 వార్డుల్లో ఎంఐఎం గెలుపు
    • జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి అనుచరులు



  • Feb 13, 2026 15:55 IST

    ఆ మూడు కార్పొరేషన్లు కాంగ్రెస్‌ పార్టీవే!

    • మంచిర్యాల, రామగుండ, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ విజయం
    • మంచిర్యాలలో 60 వార్డులకు గానూ 41 వార్డుల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ 8, భాజపా 4, ఇతరులు 2 వార్డుల్లో విజయం
    • రామగుండలో 60 వార్డులకు గానూ 35 వార్డుల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ 13, భాజపా 1, ఇతరులు 4 వార్డుల్లో విజయం
    • నల్గొండలో మొత్తం 48 వార్డులు ఉండగా, కాంగ్రెస్‌ 26, బీఆర్‌ఎస్‌ 8, భాజపా 4, ఇతరులు ఏడు వార్డుల్లో విజయం



  • Feb 13, 2026 15:55 IST

    స్వతంత్ర అభ్యర్థుల కోసం పోటీ.. ఇస్నాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

    • సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటని ప్రధాన పార్టీలు
    • మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్‌ఎస్‌ 12, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపు
    • మ్యాజిక్ ఫిగర్ కోసం 2 సీట్ల దూరంలో బీఆర్‌ఎస్‌, 4 సీట్ల దూరంలో కాంగ్రెస్
    • స్వతంత్ర అభ్యర్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఇరు పార్టీ వర్గాలు
    • కౌంటింగ్ సెంటర్ నుంచి క్యాంపులకు తరలించేందుకు ఇరు పార్టీల నాయకుల యత్నం
    • భారీగా మోహరించిన పోలీసులు, దీంతో ఉద్రిక్త వాతావరణం



  • Feb 13, 2026 15:55 IST

    వర్ధన్నపేటలో 12వ వార్డు ఫలితం తారుమారు.. బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన

    • వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో 12వ వార్డు ఫలితం రీకౌంటింగ్‌లో తారుమారు కావడంతో ఉద్రిక్తత
    • ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారన్న బీఆర్‌ఎస్‌
    • 12 వార్డులో మొదట ఏడు ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటన
    • రీకౌంటింగ్‌ తర్వాత 13 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారని రిటర్నింగ్‌ అధికారి ప్రకటన
    • ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు



  • Feb 13, 2026 15:54 IST

    ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో గెలిచిందంటే..

    • మున్సిపల్‌ ఫలితాల లెక్క తెలుతోంది.
    • మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయానికి 65 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చాయి.
    • కాంగ్రెస్‌ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది.
    • బీఆర్‌ఎస్‌ 7 మున్సిపాలిటీల్లో గెలుపొందింది.
    • జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ విజయం
    • 18 మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది.



  • Feb 13, 2026 15:53 IST

    బీజేపీ & ఎంఐఎం

    నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో బోణి కొట్టిన బీజేపీ & ఎంఐఎం

    44వ డివిజన్ కు చెందిన బీజేపీ అభ్యర్థి బట్టు రాఘవేందర్ మరియు 45వ డివిజన్ కు చెందిన బీజేపీ అభ్యర్థి బొబ్బిలి సువర్ణ విజయం సాధించారు. 

    57వ డివిజన్ కు చెందిన ఎంఐఎం అభ్యర్థి సనా జేబ్ విజయం సాధించారు.



  • Feb 13, 2026 15:48 IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

    కొత్తగూడెం కార్పొరేషన్ లో విజయం సాధించిన పార్టీలు .. 
    కాంగ్రెస్.21
    సిపిఐ.23
    సిపిఎం.1
    బిఆర్ఎస్.9
    బీజేపీ.1
    ఇండిపెండెంట్.5
    సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో... విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్ సిపిఐ...
     మేయర్ ... డిప్యూటీ మేయర్ పంచుకొనున్న సిపిఐ.. బీఆర్ఎస్



  • Feb 13, 2026 15:48 IST

    హనుమకొండ జిల్లా పరకాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

    మొత్తం 22 వార్డులు కాగా..  

    13 వార్డు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధులు 

    6 వార్డు స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్ధులు 

    3 వార్డు స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులు.



  • Feb 13, 2026 15:43 IST

    బ్రేకింగ్ న్యూస్

    సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

    20 వార్డుల్లో 11 స్థానాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్

    కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఇండిపెండెట్లు 2, ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానాల్లో గెలుపు

    ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే



  • Feb 13, 2026 15:40 IST

    మరిపెడలో ఎగిరిన కాంగ్రెస్‌ జెండా



  • Feb 13, 2026 15:39 IST

    వర్ధన్నపేటలో ఉద్రిక్తత: రీకౌంటింగ్‌లో మారిన ఫలితం!

    వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు ఫలితం రీకౌంటింగ్‌లో తారుమారు కావడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొదట వెలువడిన ఫలితాలకు, రీకౌంటింగ్ తర్వాత ప్రకటించిన ఫలితాలకు పొంతన లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

    vardhanapeta



  • Feb 13, 2026 15:39 IST

    మహబూబాబాద్ జిల్లాలో హంగ్.. చైర్మన్ పీఠం కోసం BRS మాస్టర్ స్కెచ్!

    ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీ ఫలితాల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే ఆసక్తిగా మారింది. రెండు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి.

    FotoJet (2)



  • Feb 13, 2026 15:38 IST

    చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. నేడు విడుదలైన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది.

    Congress
    Congress



  • Feb 13, 2026 15:22 IST

    FLASH

    ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్!



  • Feb 13, 2026 15:21 IST

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం దిశగా దూసుకుపోతోంది..
    ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
    ఆయా మున్సిపాలిటీల్లో ఇంకా కొన్ని వార్డుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పటికీ, దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో అధికారం చేపట్టేందుకు అవసరమైన వార్డులను ఇప్పటికే దక్కించుకుంది..
    కొత్తగూడెం నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు మాత్రం వెల్లడి కావలసి ఉంది.



  • Feb 13, 2026 15:16 IST

    FLASH: కరీంనగర్ లో దూసుకుపోతున్న BJP!



  • Feb 13, 2026 15:16 IST

    గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో..

    గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ లో ఉద్రిక్తత
    2వ వార్డులో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి మమత భర్తపై దాడి చేసిన కాంగ్రెస్ శ్రేణులు..

    గెలిచిన తరువాత వార్డులో ఊరేగింపు తీస్తుండగా మొదలైన వివాదం



  • Feb 13, 2026 15:15 IST

    🔹 Round-2 ముగిసే సరికి

    • 🟠 Bharatiya Janata Party (BJP) – 26 వార్డుల్లో లీడ్
    • 🔵 Indian National Congress (INC) – 17 వార్డుల్లో లీడ్
    • 🟣 Bharat Rashtra Samithi (BRS) – 11 వార్డుల్లో లీడ్
    • 🟢 All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) – 4 వార్డుల్లో లీడ్
    • ⚪ ఇండిపెండెంట్స్ – 4 వార్డుల్లో లీడ్



  • Feb 13, 2026 15:12 IST

    తెలంగాణ మున్సిపాలిటీల ఫలితాలు (మధ్యాహ్నం 3:00 గంటల వరకు)



  • Feb 13, 2026 15:11 IST

    రామగుండం కార్పొరేషన్



  • Feb 13, 2026 15:09 IST

    మెదక్: ఎమ్మెల్యే మైనంపల్లికి షాక్!



  • Feb 13, 2026 15:09 IST

    మెదక్ మునిసిపాలిటీలో అత్యధిక వార్డుల్లో గెలుపొందిన బీఆర్ఎస్

    మొత్తం వార్డులు - 32
    బీఆర్ఎస్ - 15
    కాంగ్రెస్ - 14
    బీజేపీ - 2
    బీఎస్పీ - 1



  • Feb 13, 2026 15:08 IST

    జమ్మికుంట కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట కౌంటింగ్‌ శిబిరానికి వెళ్లకుండా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాధను అడ్డుకున్న కాంగ్రెస్‌ నాయకులు

    • ఇరువర్గాల మధ్య వాగ్వాదం తోపులాట
    • పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
    • విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కారులో తీసుకెళ్లిన ఆ పార్టీ శ్రేణులు



  • Feb 13, 2026 15:05 IST

    ఆలేరు కాంగ్రెస్‌దే

    ఆలేరు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.
    మొత్తం 12 వార్డుల్లో ఏడింటిని కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది
    బీఆర్‌ఎస్‌కు 3, భాజపాకు2 దక్కాయి.



  • Feb 13, 2026 14:57 IST

    బీఆర్ఎస్

    బ్రేకింగ్ న్యూస్
    సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
    మొత్తం 12 వార్డులకు బీఆర్ఎస్ 7 వార్డుల్లో, కాంగ్రెస్ 5 వార్డుల్లో గెలుపు



Advertisment
తాజా కథనాలు