Telangana Municipal Election Polling🔴LIVE : మున్సిపల్ పోలింగ్‌ ప్రత్యక్ష ప్రసారం

మున్సిపల్ పోలింగ్‌ ప్రత్యక్ష ప్రసారం

author-image
By Manoj Varma
New Update
Telangana Municipal Election Polling

  • Feb 11, 2026 17:13 IST

    ముగిసిన మున్సిపల్ ఎన్నికలు...ఎల్లుండి తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

    తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగాయి.

    telangana local body elections counting updates
    Telangana Municipal Elections



  • Feb 11, 2026 16:39 IST

    Police Commissioner Sunil Dutt

    Police Commissioner Sunil Dutt said that the five municipal elections in the district are proceeding peacefully. In the context of the ongoing elections in Edulapuram, Wyra, Kalluru, Madhira, Sathupalli municipalities, the Police Commissioner visited several polling stations. Police bandobast and election security arrangements were inspected. The polling process and bandobast arrangements were discussed with Additional DCP Prasad Rao, Ramanujam, and Kalluru ACP Vasundhara Yadav. Directions were given to the police officers to prevent any untoward incident. They wanted to take steps to ensure that queue lines are observed at polling stations. They advised that all necessary measures should be taken to conduct the elections in a completely peaceful and free atmosphere, and that the police officers should be alert. He said that tight security has been arranged so that people can exercise their right to vote in a peaceful atmosphere.
    Commissioner of Police,
    Khammam.



  • Feb 11, 2026 16:34 IST

    పోలీస్ కమిషనర్ ను ఆకర్షించిన హరిత పోలింగ్ కేంద్రం

    మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రాన్ని, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS గారు సందర్శించారు. హరిత పోలింగ్ కేంద్రాన్ని అలంకరించిన తీరును పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఆనందం వ్యక్తం చేస్తూ, పెండ్లి పందిరి మాదిరిగా అలంకరించినట్లుగా వుందని తెలిపి హరిత పోలింగ్ కేంద్రం వద్ద ఇతర పోలీస్ అధికారులతో కలసి ఫోటో దిగారు.

    Haritha



  • Feb 11, 2026 16:20 IST

    ఓటు వేయించుకుని వదిలేసిన నేతలు!



  • Feb 11, 2026 15:55 IST

    కొనసాగుతున్న పోలింగ్‌.. 62.55 శాతం నమోదు



  • Feb 11, 2026 15:44 IST

    కాకాణి గోవర్ధన్ రెడ్డి

    మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని నెల్లూరు లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు.

    Kakani Govardhan Reddy



  • Feb 11, 2026 15:06 IST

    శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లోని కార్పొరేటర్ ఎన్నికల సందర్భంగా హైటెక్ సిటీ క్లబ్ పోలింగ్ కేంద్రంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
    ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన హక్కు. ప్రతి పౌరుడు తన ఓటును బాధ్యతగా, ఆలోచనతో వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య బలోపేతానికి అందరం కలిసి ముందుకు సాగుదాం.

    Sri Kokkirala Prem Sagar Rao



  • Feb 11, 2026 15:04 IST

    మున్సిపల్ ఎన్నికల్లో ఓటు చోరీ



  • Feb 11, 2026 15:03 IST

    Telangana Municipal Elections 2026

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 48.54 పోలింగ్ శాతం నమోదు
    మున్సిపాలిటీలలో 51.66 శాతం.. కార్పొరేషన్లలో 40.96 శాతం నమోదైన పోలింగ్



  • Feb 11, 2026 15:02 IST

    ప్రజాస్వామ్య పండుగలో భాగంగా…

    తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డులో పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ✨
    సాధారణ ఓటరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి, క్యూలో నిలబడి ఓటు వేసిన ఎమ్మెల్యే గారు ప్రజాస్వామ్యానికి తన కట్టుబాటును మరోసారి చాటిచెప్పారు..
    ఈ సందర్భంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు..
    ప్రతి ఓటు విలువైనది… అభివృద్ధికి మీ ఓటే బలం అని పేర్కొన్నారు..
    ✋ ప్రజాస్వామ్యం బలపడాలి…
    🗳️ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

    Yashaswini Reddy



  • Feb 11, 2026 14:37 IST

    దామోదర్ రాజానర్సింహా



  • Feb 11, 2026 14:36 IST

    జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్, జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు

    గద్వాల పట్టణ పురపాలికలో గల  దౌదర్పల్లి వార్డులో మున్సిపాలిటీ  ఎన్నికల శైలిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్, జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు గారు మరియు గద్వాల్ డిఎస్పి వై మొగిలయ్య గారు.

    Gadwal



  • Feb 11, 2026 14:35 IST

    డీజీపీ బి. శివధర్ రెడ్డి IPS

    రాష్ట్రంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ తీరుపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డీజీపీ బి. శివధర్ రెడ్డి IPS సమీక్ష నిర్వహించారు. వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిచేందుకు సూచనలు చేశారు.

    DGP B Shivadhar Reddy



  • Feb 11, 2026 14:32 IST

    మున్సిపల్ ఎన్నికల పోలింగ్

    మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.

    Jupalli Krishnarao



  • Feb 11, 2026 14:32 IST

    నిజామాబాద్ జిల్లా

    1 గంట వరకు పోలింగ్ శాతం.
    ఆర్మూర్ మున్సిపాలిటీలో 47.93
    బోధన్ మున్సిపాలిటీలో
    50.69
    భీమ్ గల్ మున్సిపాలిటీలో
    51.53
    నిజామాబాద్ కార్పొరేషన్ 35.49

    నిజామాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీ లు ఒక్క కార్పొరేషన్ లో 
    196606 ఓటర్లు ఓటు వేసారు.
    మొత్తంగా 
    39.68  శాతం నమోదు.

    కామారెడ్డి జిల్లా
    1గంట  వరకు 

     బాన్సువాడ 
    మున్సిపాలిటీలో   50.51%..
     పోలింగ్  నమోదు.


    బిచ్కుంద మున్సిపాలిటీ   60.69% నమోదైన పోలింగ్...

    కామారెడ్డి మున్సిపాలిటీ  43.79 శాతం

    ఎల్లారెడ్డి 52.92శాతం

    ఇప్ప5ఈ వరకు జిల్లలో మొత్తంగా
    47.13 శాతం నమోదు.

     70466 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు....



  • Feb 11, 2026 14:31 IST

    జోగులాంబ గద్వాల జిల్లా...

    జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో ఉదయం ఏడు గంటల నుంచి 1 గంట వరకు 59.77 పోలింగ్ శాతం...

    1)అలంపూర్:60.84 శాతం 

    2)గద్వాల:55.52 శాతం

    3)అయిజ:68.19 శాతం

    4)వడ్డేపల్లి:68.57 శాతం..



  • Feb 11, 2026 14:31 IST

    సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 57.98 శాతం పోలింగ్ నమోదు

    1. గజ్వేల్ మున్సిపాలిటీ-  54.80 శాతం

    2. హుస్నాబాద్ మున్సిపాలిటీ- 58.05 శాతం

    3. చేర్యాల మున్సిపాలిటీ- 62.86 శాతం

    4. దుబ్బాక మున్సిపాలిటీ-  61.74 శాతం.



  • Feb 11, 2026 14:30 IST

    టి. జీవన్‌రెడ్డి

    కాంగ్రెస్‌ కార్యకర్తలకు, వలస వాదులకు జరుగుతున్న ఎన్నికలని... 
    ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ కార్యకర్తల  ఆత్మాభినం , ఆత్మగౌరవంగా పరిగణిస్తానని.. 
    మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి. జీవన్‌రెడ్డి అన్నారు..
    జగిత్యాల బాలుర జూనియర్‌ కళశాలలో తన ఓటు హక్కు కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకు న్నారు....

    T Jeevan Reddy



  • Feb 11, 2026 14:28 IST

    నారాయణపేట జిల్లా ఎస్పీ డా. వినీత్ IPS

    మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మక్తల్ టౌన్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల మరియు గార్లపల్లి పోలింగ్ కేంద్రాలను నారాయణపేట జిల్లా ఎస్పీ డా. వినీత్ IPS గారు సందర్శించి ఓటింగ్ సరళి, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి భద్రతా సూచనలు చేస్తూ, మక్తల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

    Vineeth IPS



  • Feb 11, 2026 14:26 IST

    సాయి చైతన్య ఐపీఎస్

    మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సరళిని #NizamabadCP సాయి చైతన్య ఐపీఎస్ క్షుణ్ణంగా పర్యవేక్షించారు. వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సిబ్బంది ఓటర్లతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఆదేశించారు.
    వృద్ధ ఓటరుకు స్వయంగా వీల్‌చైర్ సాయం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.



  • Feb 11, 2026 14:24 IST

    జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

    ◆ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల సరళిని పర్యవేక్షించిన
    ------------------------------------------------------------------------------------
    ✴️ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ గారు
    📍జహీరాబాద్ పట్టణంలోని మునిసిపల్ ఎన్నికల రోజున పలు వార్డుల పోలింగ్ స్టేషన్లను పరిశీలించడం జరిగింది...

    A Chandrashekar



  • Feb 11, 2026 14:23 IST

    పట్నం మహేందర్ రెడ్డి

    మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు తాండూర్ పట్టణం 28వ వార్డులో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో నా కుమారుడు పట్నం రినీష్ రెడ్డి  కూడా ఓటు హక్కును వినియోగించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.
    -పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి

    Patnam Mahender Reddy



  • Feb 11, 2026 14:22 IST

    పోలింగ్ బూతులను పరిశీలించిన జిల్లా ఎస్పీ.డాక్టర్.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS.

    ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు మునిసిపాలిటీలలో 65 వార్డులకు ఎలక్షన్స్ జరుగుతున్నందున జిల్లా ఎస్పీ గారు అన్ని పోలింగ్ స్టేషను లను పరిశీలించారు. అనంతరం ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ స్వేచ్ఛయుత వాతావరణం లో ఓటు వేసుకునే విధంగా వెసులుబాటు కల్పించి వారి యొక్క భద్రతను చూసుకోవాలని వివిధ పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి తో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ.ఎన్.వెంకటేశ్వర్లు, SB CI కనకయ్య మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

    IPS



  • Feb 11, 2026 13:39 IST

    DGP

    మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది
    నల్గొండ, కరీంనగర్‌లో చిన్నగొడవలే-DGP శివధర్‌రెడ్డి
    పోలింగ్‌ బూత్‌లో ప్రచారం చేస్తే పీఎస్‌కు తరలిస్తాం
    అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవం-DGP



  • Feb 11, 2026 13:27 IST

    వినయ్ కుమార్ రెడ్డి

    ఆర్మూర్ పట్టణంలోని 23వ వార్డులో సకుటుంబ సమేతంగా ఓటు వేసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు...

    Vinay Kumar Reddy



  • Feb 11, 2026 13:24 IST

    కుందూరు జానారెడ్డి

    నందికొండ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నందికొండ మున్సిపాలిటీ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గారు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ గారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు.
    రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యం.
    ఓటు మన ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత. 
    మెరుగైన మౌలిక సదుపాయాలు, పారదర్శకమైన పాలన కోసం ప్రతి పౌరుడు ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని తమ ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

    Janareddy



  • Feb 11, 2026 13:19 IST

    కుర్ర తిరుపతి అరెస్ట్

    కరీంనగర్‌ మున్సిపల్ ఎన్నికల కేంద్రం వద్ద ఉద్రిక్తత

    కాంగ్రెస్ నాయకుల ఆగడాలను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

    బీఆర్ఎస్ నాయకుడు కుర్ర తిరుపతిని అరెస్ట్ చేస్తుండగా అడ్డుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల 

    పోలీస్ వాహనంలో నుండి బీఆర్ఎస్ నాయకుడిని బయటికి తీసుకొచ్చి.. పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే గంగుల



  • Feb 11, 2026 13:18 IST

    మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి - మంత్రి సతీమణి లలిత

    మక్తల్ పట్టణంలో 7 వ వార్డు మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల,  పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి సతీమణి లలిత.కుమారులు అచ్యుత్ రామ్,  అమిత్ రాజ్ లు



  • Feb 11, 2026 13:08 IST

    జగదీశ్ రెడ్డి



  • Feb 11, 2026 13:06 IST

    చిట్యాల మున్సిపాలిటీ

    కాంగ్రెసోళ్ళు 4 వేలు ఇస్తే, మీరు 5 వేలు ఇచ్చుకోండని చెప్తున్న పోలీసులు

    చిట్యాల మున్సిపాలిటీ 1వవార్డు శివనేనిగూడెంలో కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలికిన ఎస్సై



  • Feb 11, 2026 13:05 IST

    కరీంనగర్‌లో ఎన్నికల సిబ్బంది పై పిచ్చి కుక్కల దాడి

    కరీంనగర్‌లో ఎన్నికల సిబ్బంది పై పిచ్చి కుక్కల దాడి

    ఎన్నికల పోలింగ్‌ కేంద్రం ప్రాంగణంలో ఉన్న ఎన్నికల సిబ్బందిపై దాడి చేసిన రెండు పిచ్చి కుక్కలు

    ఈ క్రమంలో గాయపడ్డ ముగ్గురు అధికారులు

    గాయపడినవారికి అక్కడే ఉన్న వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స చేయించి.. వ్యాక్సిన్‌ ఇప్పించి ఇంటి దగ్గర దింపినట్లు పేర్కొన్న అధికారులు



  • Feb 11, 2026 13:03 IST

    ఓటర్లకు నకిలీ వెండి నాణేల పంపిణీ!



  • Feb 11, 2026 13:02 IST

    నల్లమోతు భాస్కర్ రావు

    మిర్యాలగూడ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి: మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
    పట్టణ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బాపూజీ నగర్‌లోని వడ్డెర సంఘ భవనంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు
    రాబోయే ఐదేళ్లలో మిర్యాలగూడ పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజలు తమ వ్యక్తిగత పనుల కంటే ప్రజాస్వామ్య బాధ్యతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

    Nallamothu Bhasker Rao



  • Feb 11, 2026 12:48 IST

    ఎంపీ డీకే అరుణ

    మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 22వ డివిజన్ కు సంబంధించి పద్మావతి కాలనీ ప్రతిభ కాలేజ్ లోని 98 పోలింగ్ బూత్ లో  ఎంపీ డీకే అరుణ ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఓటు అంటే ఒక అవకాశం. మన భవిష్యత్తును మార్చుకునే సువర్ణావకాశం. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను.

    DK Aruna



  • Feb 11, 2026 12:42 IST

    ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త‌త‌



  • Feb 11, 2026 12:37 IST

    బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు



  • Feb 11, 2026 12:36 IST

    దీప్తి

    మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సతీమతి దీప్తి గారితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ గారు.
    మెట్‌పల్లి మరియు కోరుట్ల ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

    Deepthi



  • Feb 11, 2026 12:34 IST

    సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్

    సిరిసిల్ల పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్.

    Garima Agarwal



  • Feb 11, 2026 12:33 IST

    డా.గాదరి కిశోర్ కుమార్ - కమల దంపతులు

    మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తిరుమలగిరి పట్టణ కేంద్రంలోని 7వ వార్డు అక్షర స్కూల్ లో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ - కమల దంపతులు ఓటు హక్కును  వినియోగించుకున్నారు

    Gadhari Kishor Kumar



  • Feb 11, 2026 12:31 IST

    శ్రీనివాస్ గౌడ్

    మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా శ్రీనివాస కాలనీలోని గీతం హై స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

    Srinivas Goud



  • Feb 11, 2026 12:30 IST

    పొన్నం ప్రభాకర్

    హుస్నాబాద్ నవ భారత్  హైస్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar

    https://www.facebook.com/share/r/1AeXV3d8qZ/



  • Feb 11, 2026 12:29 IST

    రాజ్ ఠాకూర్

    అభివృద్ధి, పురోగతి కోసం ఓటు హక్కు వినియోగించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు
    ఈ రోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభివృద్ధి మరియు పురోగతి కోసం రామగుండం ఎమ్మెల్యే శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన ప్రాంత భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకొని బలమైన ప్రజాస్వామ్యం, అభివృద్ధి దిశగా అడుగు వేయాలి” అని పిలుపునిచ్చారు.
    మీ ఓటే మార్పుకు మొదటి అడుగు.
    తప్పక ఓటు వేయండి.

    Raj Takur



  • Feb 11, 2026 12:28 IST

    నీలం మధు

    ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకున్న  నీలం మధు..
    బుధవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జిల్లాపరిషత్ హై స్కూల్ లో మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగో వార్డ్ నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి నీలం కవిత, తన కూతుర్లు సింధుజ, కీర్తి తో కలసి ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 18 సంవత్సరాలు  నిండిన ప్రతి ఒక్కరు స్వచ్ఛధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే తగిన ఆయుధమని ప్రతి ఒక్కరు ఓటు వేసి తమ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

    Neelam Madhu



  • Feb 11, 2026 12:21 IST

    మదన్ మోహన్ రావు

    కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి దూరి ఓటర్లను ప్రలోభపెడుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, అతని పీఏలు

    నాన్ లోకల్ కాంగ్రెస్ నాయకులను మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలలోకి ఎలా అనుమతి చేశారంటూ పోలీసులను నిలదీసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

    పోలీసుల తీరుపై నిరసన తెలిపిన జాజాల సురేందర్‌ను, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు తరలింపు



  • Feb 11, 2026 12:19 IST

    As Of 11:30 Am, 28.4% Polling Was Recorded



  • Feb 11, 2026 12:16 IST

    ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఉద్రిక్తత



  • Feb 11, 2026 12:15 IST

    డి.వి. శ్రీనివాస రావు

    మెదక్ మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ కేంద్రాల పరిశీలన
    పెద్ద బజార్, పిట్లం బేస్, నవాబ్ పేట్, గర్ల్స్ హై స్కూల్, గోల్కొండ విధి పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పరిశీలించారు.
    భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తును సమీక్షించి, శాంతియుత ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

    Medak Municipality



  • Feb 11, 2026 11:54 IST

    మహబూబాబాద్ 14వ వార్డు



  • Feb 11, 2026 11:47 IST

    శ్రీ షబ్బీర్ అలీ

    కామారెడ్డి జిల్లా 11-02-2026
    ఈరోజు కామారెడ్డి పట్టణంలోని మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బూత్ నెంబర్ 151 లో ఓటు హక్కు వినియోగించుక్కన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి శ్రీ షబ్బీర్ అలీ గారు.

    Shabbir Ali



  • Feb 11, 2026 11:45 IST

    భట్టి విక్రమార్క

    మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా డెయిరీ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క



Advertisment
తాజా కథనాలు