/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)
మద్యం ప్రియులకు ఇది నిజంగా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో మద్యం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మందుబాబులు ఎక్కడా కూడా తగ్గకుండా వేసవి రాకముందే బీర్లు తెగతాగేస్తూ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మందుబాబులకు పోలీసులు మరో బిగ్ షాకిచ్చారు.
మార్చి14వ తేదీన మద్యం షాపులు బంద్
హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా మార్చి14వ తేదీన మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పోలీసులు పలు కీలక సూచనలు, హెచ్చరికలు కూడా చేశారు.
Also read : మాతృభాష వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం.. కోర్టు సంచలన తీర్పు
Also Read : పుచ్చకాయలను ఉదయాన్నే ఇలా తింటున్నారా.. మీరు డేంజర్‌లో ఉన్నట్లే!
రంగులు చల్లొద్దు, ర్యాలీలు నిర్వహించొద్దు
శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలుగకుండా హోలీ పండగ జరుపుకోవాలన్నారు. ఎవరైనా మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హోలీ సందర్భంగా బీఫ్ దుకాణాలను సైతం ఆ రోజు మూసివేయాలని నిర్వాహకులను జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. ఇక హోలీ పండుగ సందర్భంగా దేశంలోని అన్ని విద్యాసంస్థలకు, బ్యాంకులకు సెలవు ఉండనుంది.
తెలుగు రాష్ట్రాల్లో హోలీ పండగను చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. కొందరు రంగులు చల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తే... మరికొందరు గుడ్లు, టమాటాలతో సెలబ్రేట్ చేసుకుంటారు,
Also Read : కేబీసీకి అమితాబ్ గుడ్ బై..తర్వాత హోస్ట్ గా ఆ ముగ్గురిలో ఒకరు..
Also Read : గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్
-
Mar 13, 2025 21:02 IST
బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.20 వేలు..!
-
Mar 13, 2025 14:32 IST
డైరెక్టర్ గీతాకృష్ణపై పోలీస్ కేసు!
-
Mar 13, 2025 11:30 IST
సీఎంతో రహస్యంగా భేటీ.. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ కీలక కామెంట్స్!
-
Mar 13, 2025 08:06 IST
Telangana: తెలంగాణవాసులకు వాతావరణ శాఖ ముఖ్య సమాచారం.. ఇక ఎండ దంచుడే దంచుడు!