🛑LIVE NEWS: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే ఇస్తాం.. సీఎం అధికారిక ప్రకటన! By Manoj C 29 Nov 2024 | నవీకరించబడింది పై 29 Nov 2024 21:22 IST in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Nov 29, 2024 21:22 IST ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే ఇస్తాం.. సీఎం అధికారిక ప్రకటన! ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేస్తామన్నారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. Also Read : https://rtvlive.com/telangana/cm-revanth-reddy-key-statement-on-the-indiramma-houses-telugu-news-7659539 Nov 29, 2024 20:09 IST అల్లు అర్జున్‌కు రేవంత్ థాంక్స్.. పుష్ప ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ! అల్లు అర్జున్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి థాంక్స్ చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియో చేయడంతో అల్లు అర్జున్‌ను అభినందించారు. డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. Also Read : https://rtvlive.com/cinema/cm-revanth-reddy-support-to-allu-arjun-pushpa-2-movie-7659385 Nov 29, 2024 17:03 IST సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. Also Read : https://rtvlive.com/cinema/samantha-father-joseph-prabhu-passed-away-7658851 Nov 29, 2024 16:54 IST జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్! త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. Also Read : https://rtvlive.com/telangana/aicc-decided-the-candidature-of-t-jeevan-reddy-for-mlc-elections-7658792 Nov 29, 2024 16:03 IST హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్ హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకాలు కలవరపెడుతున్నాయి. 12 ఏళ్ల బాలికలను కాంట్రాక్ట్ పద్దతిలో మ్యారేజ్ చేసుకోవడం సంచలనం రేపుతోంది. కోరికలు తీర్చుకోవడంతోపాటు నిజాం వారసత్వాన్ని కాపాడేందుకు ఇలా చేస్తున్నట్లు Aaj Tak సీక్రెట్ ఆపరేషన్ లో బయటపెట్టింది. Also Read : https://rtvlive.com/telangana/arab-sheikh-contract-marriage-with-12-year-old-girls-in-hyderabad-telugu-news-7658479 Nov 29, 2024 14:39 IST పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. ఎమ్మెల్యేపై సీరియస్ కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు. I came to Kakinada port to check the illegal smuggling of PDS rice. A scam Which became rampant in last regime and it’s still continuing. This port looks like free for all. No accountability. pic.twitter.com/4H9e8z4Fyz — Pawan Kalyan (@PawanKalyan) November 29, 2024 Nov 29, 2024 12:59 IST అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ స్వాధీనం అరేబియా సముద్రంలో భారత్ నౌకాదళం 500 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు పడవల్లో క్రిస్టల్ మెత్‌ను తరలిస్తున్న తొమ్మిది మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. https://rtvlive.com/crime/arabian-sea-huge-drug-haul-seized-india-srilanka-navy-officers-7657874 Based on info from #SriLankanNavy regarding probable narcotics smuggling by Sri Lanka-flagged fishing vessels in the Arabian Sea, the #IndianNavy responded swiftly through a coordinated operation to track and intercept the boats. 500 kg of narcotics (Crystal Meth) seized! pic.twitter.com/TGM27NKmbZ — Rajat Pandit (@rajatpTOI) November 29, 2024 Nov 29, 2024 12:57 IST ఆ ఇద్దరు నేతలపై సీఎం చంద్రబాబు సీరియస్.. AP: జేసీ ప్రభాకర్, ఎమ్మెల్యే ఆదినారాయణ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే తనను కలవాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. కాగా RTPP బూడిద తరలింపు విషయంలో జేసీ, ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. https://rtvlive.com/andhra-pradesh/cm-chandrababu-serious-on-mla-adhinarayana-and-jc-prabhakar-7657967 Nov 29, 2024 12:02 IST కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు ఎప్పటి నుంచి చేసుకోవాలంటే! ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల్ని స్వీకరించాాలని నిర్ణయించింది. https://rtvlive.com/andhra-pradesh/andhra-pradesh-government-to-take-new-ration-card-application-form-december-2-7657868 Nov 29, 2024 11:35 IST బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్ TG: లగచర్ల ఘటనలో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన 3 FIRలలో రెండిటిని హైకోర్టు కొట్టేసింది. కాగా లగచర్ల అల్లర్ల కేసులో అరెస్టైన నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. https://rtvlive.com/telangana/telangana-high-court-big-relief-for-brs-ex-mla-patnam-narender-reddy-7657737 Nov 29, 2024 10:22 IST ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! TG: ధరణి పోర్టల్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ధరణి సమస్యలపరిష్కార బాధ్యతలను అదనపు కలెక్టర్(రెవెన్యూ), రెవెన్యూ డివిజన్ అధికారి(ఆర్డీవో)లకు అప్పగించింది. మార్గదర్శకాలు విడుదల చేస్తూఉత్తర్వులు జారీ చేసింది. https://rtvlive.com/telangana/revanth-government-key-decision-dharani-portal-7657633 Nov 29, 2024 10:11 IST Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ! TG: సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు అక్కడ జరిగే CWC సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ వెళ్లనున్నారు. https://rtvlive.com/telangana/cm-revanth-reddy-to-attend-congress-working-committee-meet-held-at-held-7657514 Nov 29, 2024 09:58 IST నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్! నాగచైతన్య - శోభిత పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నేడు అన్నపూర్ణ స్థూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో హల్దీ వేడుక నిర్వహించారు. నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://rtvlive.com/cinema/naga-chaitanya-sobhita-wedding-haldi-photos-viral-telugu-news-7657457 Nov 29, 2024 09:57 IST ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు..పుతిన్ కీలక వ్యాఖ్యలు! అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ట్రంప్ పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. https://rtvlive.com/international/us-president-trump-not-safe-russian-president-vladimir-putin-7657523 Nov 29, 2024 08:21 IST రెండు రోజుల్లోనే పాస్‌పోర్ట్ కావాలా? అయితే,వెంటనే ఇలా చేయండి హైదరాబాద్ లోని మూడు పాస్‌పోర్టు సేవాకేంద్రల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని పాస్‌పోర్టు అధికారులు సూచిస్తున్నారు. https://rtvlive.com/telangana/passport-appointment-slow-in-hyderabad-fast-in-districts-telangana-7657410 Nov 29, 2024 07:45 IST రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం! TG: రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. https://rtvlive.com/telangana/telangana-government-said-good-news-to-farmers-7657385 Nov 29, 2024 07:20 IST పంచాయతీ ఎన్నికలపై సర్కార్ కీలక నిర్ణయం! తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. https://rtvlive.com/telangana/revanth-government-key-decision-on-panchayat-elections-7657362 Nov 29, 2024 07:19 IST మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు నేడు బంగారం ధరలు భారీగానే తగ్గాయని చెప్పవచ్చు. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. https://rtvlive.com/business/today-gold-rates-are-decreased-in-these-cities-7657367 #breaking-news #rtvlive #telangana-news-updates #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి