Vijayawada: నేడు రెండు అవతారాలలో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ!

ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మవారు రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారు మహిషాసుర మర్థని దేవి గా దర్శనం ఇవ్వగా..మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరి దేవిగా కనిపించనున్నారు. ఇంద్రకీలాద్రి పై దేవీ శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి.

New Update
Vijayawada: నేడు రెండు అవతారాలలో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ!

విజయవాడ ఇంద్ర కీలాద్రి జై భవాని జైజై భవాని నామ స్మరణతో మారుమోగుతుంది. విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. దీక్ష పరులకు స్నాన ఘట్టాల వద్ద జల్లు స్నానానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భవానీ దీక్ష పరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈరోజు అమ్మవారు రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారు మహిషాసుర మర్థని దేవి గా దర్శనం ఇవ్వగా..మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరి దేవిగా కనిపించనున్నారు. ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి.

9 వరోజు సోమవారం తెల్లవారుజామున నాలుగంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మహార్నవమి గడియల్లో శ్రీ మహిషాసుర మర్ధనీదేవి గా దర్శనమిస్తారు. మహిషాసుర మర్ధనీ అవతారానికి ప్రత్యేకత ఉంది.. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మద్యాహ్నం నుండి దశమి గడియల్లో అంటే విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరిదేవి గా దర్శనమిస్తారు..

శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్ధనికి ఎంతో విశిష్టత ఉంది. సప్తశతి లో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకోపకారం చేసిన ఘట్టం వర్ణితమైంది.. సింహావాహినిగా రూపొందిన శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురిడి సేనాపతులైన చిక్షురుడు , చామరుడు, ఉదద్రుడు, బాష్కులుడు, బిడాలుడు, వంటి రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్దం లో ఆ దేవి అవలీల గా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో కీలాద్రి పై స్వయంభువైంది. రౌద్రంలో ఉన్న అమ్మను శాంతిపచేసేందుకు ఇంద్రుడు తపస్సు చేసాడు.

అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. అమ్మవారి సహజ స్వరూపం ఇదే. మహిషాసుర మర్ధనని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశిస్తాయని , సాత్విక భావం ఏర్పడుతుంది. సర్వదోషాలు పటాపంచలై ధైర్య , స్థైర్య , విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. బుధవారంతో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. మహిషాసురమర్ధనిని దర్శించుకుంటే దసరా రోజు రాజరాజేశ్వరిని కూడా దర్శించుకోవాలనే నానుడి భక్తుల్లో ఇప్పటికీ నెలకొనిఉంది.

శ్రీ రాజరాజేశ్వరి అలంకారం...

విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.. దేశ వ్యాప్తంగా విజయదశమి పండుగను భక్తులు జరుపుకుంటారు. విజయదశమి కి ఎంతో విశిష్టత ఉంది. దసరా నాడు అమ్మ దర్శనం కోసం భక్తులు ఎంతో ఇష్టపడుతారు. రాజరాజేశ్వరి దేవి గా అమ్మవారు సింహావాహనం పై ఆసీనురాలై ఉన్నారు. షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరి, శ్రీచక్ర అధిష్టానదేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించిది కాబట్టి విజయ అని అంటారు. పరమశాంతి రూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడ చేతితో పట్టుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీ దేవి ని సేవించడం వలన జీవితం ధన్యమవుతుందని , నవరాత్రుల పుణ్యఫలం సకల శుభాలు, విజయాలు సిధ్దిస్తాయని భక్తుల విశ్వాసం

విజయదశమి నాడు సాయంత్రం క్రిష్ణానదిలో ఉత్సవమూర్తులను పోలీసులు ఊరేగింపుగా దుర్గాఘాట్ కు తీసుకెళ్తారు. గంగా పార్వతి సమేత మల్లేశ్వరుల స్వామివార్లు హంస వాహానం పై నదీవిహారం చేస్తారు.

Also read: రాజమండ్రి వేదికగా రాష్ట్ర రాజకీయాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు