6 గ్యారంటీల దరఖాస్తుల డేటా ఎంట్రీకి ముగిసిన గడువు.. ఆ జిల్లాల్లో మాత్రం ఇంకా నో! రేవంత్ సర్కార్ ఆరు గ్యాంటీల దరఖాస్తుల స్వీకరణకు నేటితో గడువు ముగిసింది. కొన్ని చోట్ల ఆన్లైన్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ ఆన్లైన్ ఎంట్రీ ఇప్పటికి 80 నుంచి 90 శాతం పూర్తైందని అధికారులు అంటున్నారు. మరో 2రోజుల్లో డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. By Nedunuri Srinivas 17 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS GOVT 6 Guarantees: రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో బాగంగా 6 గ్యాంటీల పథకాన్ని పట్టాలెక్కించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ధరఖాస్తులు స్వీకరించే ప్రక్రయను మొదలు పెట్టారు. ముందుగా జనవరి 6 వరకు టైం పెట్టి ఆ తరువాత జనవరి 17 వరకు దరఖాస్తుల స్వీకరంచడానికి గడువు ఇచ్చారు. నేటితో 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకుగడువు ముగిసింది.ప్రజాపాలన కార్యక్రమంలో ఈ దరఖాస్తుల ఎంట్రీ కార్యక్రమం జరిగింది. ఇంకా పలు జిల్లాలో డేటా ఎంట్రీ బ్యాలన్స్ జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 సర్కిల్స్‌లో 30 మంది స్పెషల్ ఆఫీసర్స్, 10 వేల మందికిపైగా సిబ్బంది విధుల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు . అయితే .. కొన్ని జిల్లాలో ఇంకా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తికాలేదు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్..-- ఆదిలాబాద్‌తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్.. జిల్లాల్లో డేటా ఎంట్రీ ఇంకా మిగిలే ఉంది. నల్గొండ జిల్లాలో డేటా ఎంట్రీ పూర్తైనట్లు సమాచారం. ప్రజాపాలన అమలు కోసం IAS అధికారులను నియమించింది రేవంత్ సర్కార్. కలెక్టర్ల పర్యవేక్షణలో డేటా ఎంట్రీ ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్ కాగానే దరఖాస్తుదారుల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌వస్తుంది. ఈ ప్రక్రియ అనంతరం వెరిఫికేషన్ ప్రోసెస్ మొదలవుతుంది. ఆ తరువాత అర్హులైన అర్హుల ఎంపిక చేస్తారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో అధిక దరఖాస్తులు ఆ ఆరు గ్యాంటీలకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 25 లక్షల 84వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో అధిక దరఖాస్తులువచ్చాయి. ఇక.. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా 4,88,316 అప్లికేషన్లు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో ఆన్‌లైన్ ప్రక్రియ గడువులోగా పూర్తయింది.నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4లక్షల 76వేల దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌లో ఆన్‌లైన్ ప్రక్రియ గడువుకంటే 2రోజుల ముందుగానే పూర్తయింది. కామారెడ్డిలో ఆన్‌లైన్ ప్రోసెస్ గడువులోపు పూర్తయింది. మరో 2రోజుల్లో డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశాలు మండలాల వారీ డేటా ఎంట్రీని పూర్తి చేయడం జరిగింది. ఒక్కో దరఖాస్తు ఆన్‌లైన్ చేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అయితే .. ఈ ఆరు గ్యారంటీల దరఖాస్తుపై ఉన్న నంబర్ ఆధారంగా ఆన్‌లైన్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎంట్రీ ఇప్పటికి 80 నుంచి 90 శాతం పూర్తైందని అధికారులు అంటున్నారు. మరో 2రోజుల్లో డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ALSO READ :హైదరాబాద్ కు క్యూ కట్టిన జనం .. హైవే జామ్ #revanth-reddy #ts-govt-6-guarantees #last-date-for-ts-govt-6-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి