Sikkim : సిక్కింలో భారీ వర్షం... చిక్కుకున్న పర్యాటకులు! సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారుఈ వరదల వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. By Bhavana 15 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Heavy Rain In Sikkim : సిక్కిం (Sikkim) లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. గత రెండు రోజులుగా సిక్కింలో 220 మి.మీకు పైగా వర్షం కురిసింది. దీంతో తీస్తాలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఈ వరదల (Floods) వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో (Landslides Wreak Havoc) ఇళ్లలోకి భారీగా నీరు చేరుతుంది. ఇక, వాతావరణం (Weather) అనుకూలించిన తర్వాత పర్యాటకులను ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర అధికారులు వివరించారు. రోడ్డు మరమ్మతులకు ఐదు నుంచి ఆరు రోజులు సమయం పట్టొచ్చని పేర్కొన్నారు. సిక్కింలో శుక్రవారం కూడా భారీ వర్షం (Heavy Rain) పడింది. ఈ వరదల వల్ల ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 6కి చేరుకుంది. గురువారం ముగ్గురి మృతదేహాలు దొరికాయి. మరో ముగ్గురు ఆచూకీ లేకుండా పోయారు. కాగా, సిక్కింలోని సంక్లాంగ్ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోవడంతో చుంగ్తాంగ్, లాచుంగ్ ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విపత్తు పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ అధికారులతో ప్రత్యేక భేటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన పర్యాటకులను ప్రత్యేక విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. Also Read : జగన్ మార్క్ కనిపించకుండా చంద్రబాబు కీలక నిర్ణయం #heavy-rain #floods #tourists #sikkim #landslides-wreak-havoc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి