Vijayawada : విజయవాడలో భారీ వర్షం... విరిగిపడిన కొండ చరియలు!

భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

New Update
Vijayawada : విజయవాడలో భారీ వర్షం... విరిగిపడిన కొండ చరియలు!

Heavy Rain : భారీ వర్షాలకు విజయవాడ (Vijayawada) లోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు (Landslides) విరిగిపడిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ (Gadde Rama Mohan) ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ దుర్ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినగా..మరో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వీరిలో ఓ బాలిక మృతి చెందినట్లు సమాచారం. పూర్తిగా దెబ్బ తిన్న ఇంట్లో పలువురు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple : ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు.

శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : శ్రీరామనవమి వేడుకులకు దేశమంతా సిద్ధమైంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిమిట్ట దేవాలయాల్లో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా శ్రీరామనవమి వేడుకలకు రెండు రాష్ట్రాలు ఘనంగా ఏర్పాట్లుచేస్తున్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా ఈ ఆలయంలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్ల పైన టీటీడీ అధికారులు సమీక్ష చేసారు. అధికారులకు పలు సూచనలు ఇవ్వటంతో పాటుగా చేపట్టా ల్సిన చర్యల పైన దిశా నిర్దేశం చేసారు. 

ఇది కూడా చదవండి: వేయించిన ఆహారాలతో క్యాన్సర్‌ ముప్పు

క్షేత్ర స్థాయిలో అధికారులు పటిష్ట ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీల లో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారీగా రానున్న భక్తులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిలకించేలా 15 ఎల్ ఈడీ స్క్రీన్ లు, ఆలయం , కల్యాణ వేదిక, తదితర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: లంగ్స్‌ బేషుగ్గా ఉండాలంటే తులసి ఆకులు నమలండి

విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో 100 సిసి కెమెరాలు, 3 డ్రోన్ లు, 3 కంట్రోల్ రూమ్ లు, దాదాపు 2400 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్స వాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీంలు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: పప్పు ధాన్యాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవా?

 హెచ్ డి పీపీ - (18), దాస సాహిత్య ప్రాజెక్టు - (4,) అన్నమాచార్య ప్రాజెక్టు- (8) ఆధ్వర్యంలో మొత్తం 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటిసారి కళాకృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు, కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఒంటిమిట్టలో జరిగే ఈ కల్యాణోత్సవం తిలకించటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment