BREAKING: ఏపీలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

ఆంధ్ర ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులుగా సర్వర్లు మొరాయిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రిజిస్టర్ ఆఫీసుల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

New Update
BREAKING: ఏపీలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

Land Registrations Stopped in AP: ఆంధ్ర ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులుగా సర్వర్లు మొరాయిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రిజిస్టర్ ఆఫీసుల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా జరగడం వల్ల రాష్ట్ర ఖజానాకు డబ్బు జమ అవ్వడం కష్టమని అధికారులు అంటున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడు పరిష్కరం చేస్తారనేది వేచి చూడాలి.

ALSO READ: సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

త్వరలో ఏపీలో మెగా డీఎస్సీ..

మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,100 పోస్టులను భర్తీ చేయడానికి కేబినెట్ ఓకే చెప్పింది. నిజానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌(DSC Notification) కూడా విడుదల చేయని వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం మండిపడంది. సమస్యను లేవనెత్తడం ద్వారా నిరుద్యోగులను తమవైపుకు ఆకర్షించుకునే ప్రయత్నం చేసింది. ఇది అధికార పార్టీపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషనలు వినిపించాయి. దీంతో నిరుద్యోగ యువతను తమవైపునకు తిప్పుకునేందుకు జగన్ సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

గతంలో నిరసనలు..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్ల అవుతున్నా నిన్నటివరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకుంటే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని గతేడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ హెచ్చరించింది. ఇక ఎన్నికలకు మరి కొన్ని నెలలే టైమ్‌ ఉండడంతో ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదల చేయకుంటే డీఎస్సీ అభ్యర్థుల నుంచి తిరుగుబాటు తప్పదన్న అభిప్రాయాలు వినిపించాయి. ఇటు ప్రతిపక్షం టీడీపీ సైతం ఇదే విషయంలో వైసీపీని కార్నర్ చేస్తూ వచ్చింది.

ఇక ఏపీ బడ్జెట్‌కు ముందు తాజాగా కేబినెట్ అవ్వడం.. మెగా డీఎస్సీకి నిర్ణయం తీసుకోవడంతో అభ్యర్థులు కాస్త రిలాక్స్ అయ్యారు.

DO WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు