Kushi Movie Downward Trend: ఖుషి అయిపోయింది..

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda),సమంత(Samantha) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి(Kushi). గత శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అలా వచ్చిన పాజిటివ్ టాక్, బ్లాక్ బస్టర్ గా మారడానికి మాత్రం సహకరించలేదు. సోమవారం ఈ సినిమాకు వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

New Update
Kushi Movie Downward Trend: ఖుషి అయిపోయింది..

Kushi Box Office Collection Day 4: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), సమంత(Samantha) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి(Kushi). గత శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అలా వచ్చిన పాజిటివ్ టాక్, బ్లాక్ బస్టర్ గా మారడానికి మాత్రం సహకరించలేదు. సోమవారం ఈ సినిమాకు వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

ఖుషి అయిపోయింది..

ఆంధ్రప్రదేశ్ లో ఖుషి సినిమాకు సోమవారం నాటికి ఆక్యుపెన్సీ 30శాతానికి పడిపోయింది. సాధారణంగా సోమవారం ఎంత పెద్ద సినిమాకైనా ఆక్యుపెన్సీ పడిపోతుంది. కానీ ఖుషి సినిమాకు మాత్రం ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. ఇది పక్కా ప్రేమకథ. సీడెడ్ లో ఇలాంటి ప్రేమకథలు పెద్దగా ఆడవు. ఆ ప్రభావం ఖుషి వసూళ్లపై స్పష్టంగా పడింది.

ఇక ఆంధ్రాలో చూసుకుంటే, కేవలం అర్బన్ లో మాత్రం ఖుషికి మంచి వసూళ్లు వస్తున్నాయి. బి-సెంటర్లు ఓకే కానీ, సి-సెంటర్లలో ఈ సినిమాకు వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఎందుకో సి-సెంటర్ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించలేదు. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి సినిమాలో మాస్-యాక్షన్ ఎలిమెంట్స్ లేకపోవడం, రెండోది సినిమా నిడివి ఎక్కువగా ఉండడం.

Also Read: ‘బలగం’ సినిమా నటుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డైరెక్టర్ వేణు..

ఇక నైజాంలో పరిస్థితి మరో విధంగా ఉంది. నైజాం మొత్తం వానలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో దంచి కొడుతున్నాయి. దీంతో ఆటోమేటిగ్గా ఖుషి సినిమాకు వసూళ్లు తగ్గిపోయాయి. ఇలా వాతావరణ పరిస్థితులతో పాటు, మరెన్నో కారణాల వల్ల సోమవారం నాడు ఖుషి సినిమా డల్ అయింది. ఈ శుక్రవారానికి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty) సినిమా రెడీగా ఉంది. అనుష్క, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. ఇక షారూక్ నటించిన జవాన్ (Jawan Movie) సినిమా ఉండనే ఉంది. దీంతో ఖుషి సినిమా లాంగ్ రన్ పై అనుమానాలు పెరుగుతున్నాయి.

Also Read: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి ‘మెగా’ రివ్యూ.. బొమ్మ అదుర్స్ అంటూ ట్వీట్..

Advertisment
Advertisment
తాజా కథనాలు