AP: కౌంటింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి: జిల్లా కలెక్టర్

కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు కర్నూలు కలెక్టర్ సృజన. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం.8 లోపు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లకు కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతి లేదని తెలిపారు.

New Update
AP: కౌంటింగ్ కు రాజకీయ పార్టీలు సహకరించాలి: జిల్లా కలెక్టర్

Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన RTVతో ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడారు. కౌంటింగ్ ఏజెంట్లను త్వరితగతిన నియమించుకోవాలన్నారు. ఫొటో గుర్తింపు కార్డులు ఉన్న ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 8 గంటల లోపు కౌంటింగ్ కేంద్రాల్లో ఉండాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతి లేదన్నారు. పోస్ట్ పోల్, ప్రీపోల్ దృష్ట్యా కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan - Mark Shankar: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్‌లోనే ఉండనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. తాజాగా మార్క్ ఫొటో వైరల్‌గా మారింది.

New Update

సింగపూర్ లోని స్కూల్ బిల్డింగ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్నిప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడంతో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హెల్త్ అప్డేట్

ఇక ఇవాళ ఉదయం మార్క్ శంకర్‌ హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అతడిని అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్‌ను డిశ్చార్జ్ చేయమని.. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఫొటో వైరల్

ఈ నేపథ్యంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు నెబ్లైజర్‌తో ఆక్సీజన్ తీసుకుంటున్న ఫొటో ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా అతడి కుడి చేయికి ఒక కట్టు కూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆ ఫొటో చూస్తుంటే మార్క్ శంకర్ హెల్తీగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మార్క్ శంకర్ రెండు చేతులతో థమ్సప్ సింబల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. 

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

(Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar school fire incident | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment