Kumari Aunty: కుమారి ఆంటీ మెడలో స్వర్ణ హారం.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే..!

స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫుల్ పాపులరైన కుమారి ఆంటీ.. బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తాజాగా ఈమెకు సంబంధించిన మరో ఫొటో నెట్టింట వైరలవుతోంది. కళ్యాణ్ జ్యువెలర్స్‌ షోరూమ్ లో మెడలో బంగారు ఆభరణాన్ని ధరించి సందడి చేశారు.

New Update
Kumari Aunty: కుమారి ఆంటీ మెడలో స్వర్ణ హారం.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే..!

Kumari Aunty AT Jewellery Showroom: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కనిపిస్తున్న, వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం రన్ చేస్తున్న కుమారీ ఆంటీ సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రెటీలా మారిపోయింది. ఆమె ఫుడ్ స్టాల్ వద్ద భోజనం చేసిన వారు.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరింత పాపులరైంది. దీంతో పలు టీవీ ఛానెల్స్ ఈమెను ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టారు. అలా ఈమె పేరు సోషల్ మీడియా అంతా మారుమోగింది.

Also Read: Amala Paul: ఘనంగా నటి అమలాపాల్ సీమంతం వేడుకలు.. వైరలవుతున్న ఫొటోలు

ఇక సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమసైన కుమారీ ఆంటీ.. బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. పలు సీరియల్స్, టీవీ షోస్ కనిపిస్తూ సందడి చేస్తోంది.

Kumari Aunty

కళ్యాణ్ జ్యువెలర్స్‌ లో కుమారీ ఆంటీ

అయితే తాజాగా కుమారీ ఆంటీ పేరు మరో సారి ట్రెండ్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కళ్యాణ్ జ్యువెలర్స్‌లో షోరూమ్ లో మెడలో బంగారు హారం ధరించి సందడి చేశారు. అక్కడకి  కుమారి ఆంటీ నగలు కొనుగోలు చేయడానికి వెళ్లినట్లు  సమాచారం. ఆమె ధరించిన హారం దాదాపు 10 తులాల ఉండొచ్చని.. ధర 7 లక్షల పైనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పదింస్తున్నారు. కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు.. కుమారి ఆంటీని కళ్యాణ్ జ్యువెలర్స్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

Kumari Aunty

Also Read: Disha Patani: మైనస్‌ డిగ్రీల చలిలో ప్రభాస్‌తో క్యూట్‌ బ్యూటీ రొమాన్స్‌ .. ఇటలీ ఫొటోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు