KTR: చెల్లి కోసం ఢిల్లీలో ఆటో ఎక్కిన కేటీఆర్.. వీడియో వైరల్! కవిత బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు కేటీఆర్ హడావుడిగా సుప్రీం కోర్టు నుంచి తిహార్ జైలుకు బయల్దేరారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు తన కారు దిగి ప్యాసింజర్ ఆటో ఎక్కారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. By srinivas 27 Aug 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Delhi: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు కవిత సోదరుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హడావుడిగా సుప్రీం కోర్టు (Supreme Court) నుంచి తిహార్ జైలుకు బయల్దేరారు. అయితే ఢిల్లీ ట్రాఫిక్ జామ్ లో కారు ఇరుక్కుపోవడంతో వెంటనే కారు దిగిన కేటీఆర్.. ప్యాసింజర్ ఆటో ఎక్కారు. కేటీఆర్ తో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు నివాసానికి ఆటో లో వెళ్లిన కేటీఆర్@KTR_News @BRSparty @vaddirajumprs pic.twitter.com/CgPAIvUVlE — Journalist Pandari (@Pandari_Journo) August 27, 2024 బుధవారం హైదరాబాద్ కు.. ఇదిలా ఉంటే.. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయితే మంగళవారం సాయంత్రం 7 గంటలవరకూ కవిత జైలునుంచి బయటకు రానున్నారు. విడుదల తర్వాత ఈ రోజు కేటీఆర్, కవిత, హరీష్ రావు ఢిల్లీలోనే ఉండనుండగా.. బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత కేసులో ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. #WATCH | Delhi: Bharat Rashtra Samithi (BRS) working president KTR leaves from Supreme Court. Supreme Court granted bail to BRS leader K Kavitha in the excise policy irregularities case. It also set aside the Delhi High Court's order which rejected her bail plea. pic.twitter.com/DBy4lTdSEn — ANI (@ANI) August 27, 2024 కేసీఆర్ హ్యాపీ.. కవితకు బెయిల్ మంజూరు కావడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 161 రోజుల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలియగానే.. కొడుకు కేటీఆర్‌కు ఫోన్ చేసి కవిత విడుదలపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే కూతురు రాకపై కూడా పార్టీ శ్రేణులను కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంబరాల్లో మునిగి తేలిన బీఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచుకుంటూ ఘనంగా కవితను స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. #brs-mla-ktr #brs-mlc-kavitha #delhi-liqour-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి