KTR: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక

లోక్‌సభ నియోజకవర్గాల్ని పునర్విభజించే(డీలిమిటేషన్‌) అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి కేంద్రం తీసుకోవాలని కోరారు. ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసిన డీలిమిటేషన్ లెక్కల జాబితాను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

New Update
KTR: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిక

KTR: లోక్‌సభ నియోజకవర్గాల్ని పునర్విభజించే(డీలిమిటేషన్‌) అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి కేంద్రం తీసుకోవాలని కోరారు. ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసిన డీలిమిటేషన్ లెక్కల జాబితాను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దక్షిణ భారతంలో లోక్‌సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. దక్షిణ రాష్ట్రాలు దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిస్తున్నాయన్నారు. పార్లమెంట్‌ అనేది దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అని, ఇందులో దక్షిణాది రాష్ట్రాల గొంతును అణచివేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. డీలిమిటేషన్‌ విషయంపై కేంద్రం మరోసారి పునరాలోచించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, హరియాణా, గుజరాత్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు పెరుగుతాయని.. దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతాయి అని ఆ ఇండియా టుడే నివేదికలో పేర్కొన్నారు.

డీలిమిటేషన్ ప్రక్రియని వ్యతిరేకించిన స్టాలిన్..

గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఈ డీలిమిటేషన్ ప్రక్రియని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజకీయ ఎత్తుగడ అని, జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌లో సీట్లు పెంచితే.. దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాతినిథ్యం తగ్గిపోతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తాం కానీ.. డీలిమిటేషన్ పేరుతో దక్షిణ ప్రజలకు ఎటువంటి హాని జరగదని హామీ ఇవ్వాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ పట్ల దక్షిణ భారత ప్రజల భయాన్ని తొలగించాలని కోరారు. లేదంటే ప్రజా ఉద్యమం ఎదుర్కోక తప్పదని స్టాలిన్ హెచ్చరించారు.

డీలిమిటేషన్ అంటే ఏమిటి..? 

పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను జనాభా ప్రాతిపదికిన పునర్నిర్మించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ప్రతి ప్రజాప్రతినిధి పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభకు సమాన సంఖ్యలో జనాభాకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంటుంది. అయితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియని అమలు చేయాలంటే ముందుగా రాజ్యాంగం ప్రకారం జనాభా గణన చేయాల్సి ఉంటుంది. నిజానికి 2021లో జనాభా గణన జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా జరగలేదు. చివరగా 2011లో జనాభా గణన జరిగింది. ప్రతి పది సంవత్సరాలకు ఓసారి జనగణన చేపట్టాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: తమిళనాడులో కీలక పరిణామం.. ఎన్డీఏతో పొత్తుకు అన్నాడీఎంకే గుడ్ బై

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK Vs SRH: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ సీఎస్కే vs ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్‌ గెలిచిన SRH జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో CSKజట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ రెండు జట్లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

New Update
CSK Vs SRH

CSK Vs SRH Photograph: (CSK Vs SRH)

ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ సీఎస్కే vs ఎస్‌ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్‌ గెలిచిన SRH జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో CSK జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. రెండు జట్లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాయి. వరుసగా పరాభవాలతో రెండు జట్లలోనూ ఆత్మవిశ్వాసం లోపించింది. ఆరేసి ఓటములు, రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. 

ధోనీ 400వ టీ20 మ్యాచ్‌

ఇదిలా ఉంటే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇది 400వ టీ20 మ్యాచ్‌. అతడు తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్‌‌ను SRHతో ఆడనున్నాడు. దీంతో భారత్‌ నుంచి నాలుగో ప్లేయర్‌గా ధోనీ నిలిచాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 24వ ఆటగాడిగా ఉన్నాడు. ధోనీ కంటే ముందు మరో ముగ్గురు ఉన్నారు. వారు.. రోహిత్ శర్మ 456 మ్యాచ్‌లు, దినేశ్‌ కార్తిక్ 412 మ్యాచ్‌లు, విరాట్ కోహ్లీ 408 మ్యాచ్‌లు ఆడారు. ఆ తర్వాత స్థానంలో ధోనీ ఈ ఘనత అందుకొన్నారు. ధోనీ ఇప్పటివరకు 399 మ్యాచులు ఆడాడు. అందులో మొత్తం 7,566 పరుగులు చేశాడు.

telugu-news | IPL 2025 | latest-telugu-news | CSK Vs SRH

Advertisment
Advertisment
Advertisment