Solar Cycling Track in Hyderabad: దేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కేటీఆర్! నగరంలో మరో అత్యున్నతమైన ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఫెస్టివల్స్(Cycling Festivels) కి కూడా హైదరాబాద్ వేదిక కానుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు అంటున్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఆయన 23 కిలో మీటర్ల సైకిల్ ట్రాక్(Solar cycle track) ని ఆయన ఆదివారం నాడు ప్రారంభించారు. By Bhavana 02 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి India's first solar cycling track in Hyderabad: హైదరాబాద్ నగర సిగలో మరో అత్యున్నత ప్రాజెక్ట్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నగరంలో ఫార్మూలా రేస్ (E- formula race) లు ప్రారంభించినప్పుడే నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని రాజకీయ నాయకులు, ప్రముఖులు అన్నారు. కొంత కాలం క్రితం నగరం నడిబొడ్డున ఫార్మూలా - ఇ రేసింగ్ జరగడంతో హైదరాబాద్ కి దేశంలోనే ప్రత్యేక స్థానం లభించింది. ఈ క్రమంలోనే నగరంలో మరో అత్యున్నతమైన ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఫెస్టివల్స్(Cycling Festivals) కి కూడా హైదరాబాద్ వేదిక కానుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు అంటున్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR)దగ్గర ఆయన 23 కిలో మీటర్ల సైకిల్ ట్రాక్(Solar cycle track) ని ఆయన ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన కాసేపు సైకిల్ తొక్కి సైక్లిస్ట్ లను ఉత్సాహపరిచారు కూడా. మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు, అధికారులు, హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ప్రారంభించిన సైకిల్ ట్రాక్ ని 23 కిలోమీటర్ల మేర అలంకరించారు. ఈ ట్రాక్ కి ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే..23 కిలో మీటర్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ని అమర్చడం. ఈ సోలార్ సిస్టం వల్ల సుమారు 16 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఇది 24 గంటలు కూడా అందుబాటులో ఉంటుందని వివరించారు. సాయంత్రం పూట పూర్తి స్థాయిలో లైట్లు వెలిగి..కాంతులు ప్రసారిస్తాయని వారు వివరించారు. దీనికి సోలార్ పవర్ ఉపయోగపడుతుంది. ట్రాక్ కి రెండు పక్కలా కూడా పచ్చదనం పరుచుకుని ఆహ్లాదకరంగా ఉంటుందని వారు తెలియజేశారు. దేశంలోనే ఇలాంటి ట్రాక్ ఇదే మొదటిది కావడం మరో విశేషం. అధికారులు దక్షిణ కొరియాలో (South Korea) ఉన్న సైకిల్ ట్రాక్ లను పరిశీలించి వీటిని నిర్మించినట్లు తెలిపారు. ప్రపంచంలో ఇది రెండవది కాగా..భారత్ లో మొట్టమొదటిది. ట్రాక్ 23 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు అమర్చారు. సైబరాబాద్ పోలీసులు ఆధ్వర్యంలో వీటిని 24 గంటలు పర్యవేక్షణలో ఉంచుతారు. సైకిల్ ట్రాక్ వెంట ఆరోగ్యకరమైన పదార్థాలు, రిటైల్ కియోస్క్ లు, స్కేటింగ్ రింగ్, టెన్నిస్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు, స్పోర్టింగ్ రిటైల్ షాపులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే నగరంలోనే నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట నియోపోలిస్, బుద్వేల్ లో కూడా ఇలాంటి సోలార్ సిస్టం ట్రాక్ లను అమర్చుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గండిపేట జలాశయం చుట్టూ 46 కి.మీ. మేర సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. నగరం అంతర్జాతీయ సైక్లింగ్ వేడుకలకు వేదికగా నిలుస్తుందన్నారు. Minister @KTRBRS speaking after launching Silt Carting vehicles distributed under Dalit Bandhu scheme in Hyderabad https://t.co/B7ELcXShDs— KTR, Former Minister (@MinisterKTR) October 2, 2023 🚴"My compliments to HGCL, @HMDA_Gov and entire engineering team for making Hyderabad Solar Cycling Track a reality.": Minister @KTRBRS Municipal Administration Minister KTR launched HealthWay - India's first solar cycling track in #Hyderabad today.23-km-long world-class… pic.twitter.com/hQmRP84tuv— KTR, Former Minister (@MinisterKTR) October 1, 2023 #ktr #hyderabad #solar-system #cycle-track #indias-first-solar-cycling-track-in-hyderabad #indias-first-solar-cycling-track #indias-first-solar-roof-cycling-track #solar-roof-cycling-track-in-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి