KTR: ప్రేమోన్మాది దాడి.. బాధిత కుటుంబానికి అండగా కేటీఆర్! వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది నాగరాజు దాడి చేసిన కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.5 లక్షలతో పాటు పిల్లలిద్దరి చదువు బాధ్యత తనదేనని ప్రకటించారు. ప్రభుత్వం యాభై లక్షలు అందించి, నిందితుడిని శిక్షించాలని కోరారు. By srinivas 16 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Warangal: వరంగల్ జిల్లాలోని 16 చింతల తాండ గ్రామంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.5 లక్షలతో పాటు పిల్లలిద్దరి చదువు బాధ్యత తనదేనని ప్రకటించారు. దీపికా, మదన్ చదువు బాధ్యత నాదే.. ఈ మేరకు ప్రేమోన్మాది నాగరాజు చేసిన దాడిలో తల్లితండ్రులిద్దరూ శ్రీనివాస్, సుగుణ చనిపోవటంతో ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు దీపిక, మదన్ లు అనాథలయ్యారు. దాడి ఘటనలో ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. చనిపోయిన దంపతుల పిల్లలిద్దరిని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఈ రోజు కేటీఆర్ వద్దకు తీసుకొచ్చారు. పిల్లలద్దరినీ చూసిన కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆరోగ్యం గురించి వాకబు చేసి ధైర్యంగా ఉండాలని మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దీపికా, మదన్ ల చదువు బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. హత్యకు గురైన పిల్లల తల్లి సుగుణ బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ కూడా. పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ❇️ వరంగల్ జిల్లాలోని 16 చింతల తాండ గ్రామంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అండ ❇️ పార్టీ తరఫున రూ. 5 లక్షలతో పాటు పిల్లలిద్దరి చదువు బాధ్యత తనదేనని ప్రకటన ❇️ బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో ప్రభుత్వం రూ. 50 లక్షలు… pic.twitter.com/FPg7Ib1kFf — BRS Party (@BRSparty) July 16, 2024 అత్యంత విషాదకరమైన ఈ సంఘటనలో తల్లిదండ్రులను కోల్పోవటమే కాదు.. దాడికి గురైన పిల్లలు దీర్ఘాకాలం చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ ఘటనలో నిందితుడు నాగరాజుకు కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. #ktr #warangal-tribal-family మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి