KTR : ఆ విషయంలో విఫలమయ్యాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు! తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అభివృద్ధి పనులు ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించామని,పెన్షన్లు పెంచమని, 6 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని అన్నారు. By V.J Reddy 11 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ex Minister KTR : మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) జరగనున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) సమావేశాలు నిర్వహిస్తున్నారు. ALSO READ: ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్.. BRS కు షాక్ ఈ రోజు మహబూబాబాద్(Mahabubabad) పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. 'ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోలేదు. నోటికి ఏది వస్తే అది హామి అని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చింది కాంగ్రెస్' అని అన్నారు. 6,47,479 రేషన్ కార్డులు.. కాంగ్రెస్(Congress) తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారని కేటీఆర్ అన్నారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు అని ప్రచారం చేశారని.. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారని.. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యధిక వేతనాలు... దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ తెలిపారు. ఈ విషయంపై ఏనాడు చెప్పుకోలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది మన ప్రభుత్వం కానీ మేము చెప్పుకోలేదు, ప్రచారం చేస్కోలేదని తెలిపారు. దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఫించన్ల పెంపు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచామని. పెంచినా ఏనాడు చెప్పుకోలేదని కేటీఆర్ అన్నారు. దేశంలో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కానీ ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడం విఫలమయ్యాం అయ్యాం కాబట్టే ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. అభివృద్ధి ఓడిపోయింది... కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని అన్నారు కేటీఆర్. 'పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచే వాళ్ళం. వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదు. ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనము, రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలేదు. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తుంచుకోవాలి. BRS పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ మనకు తేడా కేవలం 1.85 శాతం.' అని వ్యాఖ్యానించారు. మహబూబ్ బాద్ లో గులాబీ జెండా... మహబూబ్ బాద్ పార్లమెంట్ ఎన్నికలే మన గెలుపుకు సోపానం కావాలని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడారు, రుణం ఉన్నవాళ్లే కాదు, వ్యవసాయ రుణం లేనివాళ్లు కూడా తీసుకోండి, రాగానే వెంటనే రుణమాఫీ చేస్తామన్నారని పేర్కొన్నారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలను ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలనే స్వేద పత్రం రూపొందించాం అని అన్నారు. Also Read : వరంగల్ మేయర్ పై అవిశ్వాసం.. కొండా సురేఖ నెక్ట్స్ స్టెప్ ఏంటి? #ktr #brs-party #parliament-elections #congress-six-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి