Krishna mukunda Murari: కృష్ణ చిక్కులో పడిన ముకుంద.. శోభనం తప్పించుకునేందుకు మరో కొత్త ప్లాన్

ముకుంద నాటకం గురించి తెలుసుకున్న కృష్ణ.. ముకుంద- ఆదర్శ్ శోభనానికి ముహూర్తం పెట్టిస్తుంది. మరో వైపు మళ్ళీ శోభనం ఎలా క్యాన్సిల్ చేయాలని టెన్షన్ పడుతుంది ముకుంద. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna mukunda Murari: కృష్ణ చిక్కులో పడిన ముకుంద.. శోభనం తప్పించుకునేందుకు మరో కొత్త ప్లాన్

Krishna mukunda Murari:  ముకుంద.. ఫోన్ లో మురారి జ్ఞాపకాలను.. చూసుకుంటూ బాధపడుతుంది. ఇంక నటించడం నా వల్ల కాదు.. మురారి, ఆదర్శ్ తో నిజం చెప్పేస్తాను అని మనసులో అనుకుంటుంది.

publive-image

ఇంతలో ఆదర్శ్ ముకుంద కోసం జ్యూస్ తీసుకొని వస్తాడు. రాత్రంతా కాలి నొప్పితో భాదపడుతున్నావు.. సరిగ్గా భోజనం కూడా చేయలేదు.. అందుకే నీ కోసం జ్యూస్ తెచ్చానని అంటాడు ఆదర్శ్. భర్త అంటే ఇష్టంలేని ముకుంద.. ఆదర్శ్ ప్రేమను చూసి.. ఒక మనిషి ప్రేమ కూడా ఇంతలా బాధిస్తుందా అని ఫీల్ అవుతుంది.

publive-image
మరో వైపు రేవతి కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కృష్ణ.. అత్తయ్య ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. నేను ఏం చేస్తున్నానో నీకు చెప్పాలా అని కోడలితో ఫన్ చేస్తుంది రేవతి. ఆ తర్వాత ముకుంద గురించి కృష్ణను అడుగుతుంది. రేవతికి నిజం చెప్పలేకపోయిన కృష.. ముకుంద నాటకం ఆడుతుంది అని మనసులో అనుకుంటుంది.

publive-image
ముకుంద నాటకానికి చెక్ పెట్టాలని ఫిక్స్ అయిన కృష్ణ.. మళ్ళీ శోభనం ఏర్పాట్లకు పంతులును పిలిపిస్తుంది. రెండు జంటలకు శోభన ముహూర్తం పెట్టాలని చెప్తుంది. ఇది చెప్పగానే మురారి సంతోషంగా ఫీల్ అవుతాడు.

publive-image
మళ్ళీ శోభనం ఏర్పాట్లు అనేసరికి.. ముకుందలో టెన్షన్ మొదలవుతుంది. ఈ సారి ఎలా తప్పించుకోవాలి అని ఆందోళను పడుతూ ఉంటుంది ముకుంద.

publive-image

చాలా సేపు పంతులు జాతకాలను చూస్తూ ఉంటాడు. ఇంతలో మధు ఏమైంది పంతులు గారు జాతకాలు కలవడం లేదా అని అడుగుతాడు. ఒక జంటకు మాత్రం ముహూర్తం ఉందని చెప్తాడు.

publive-image

ముకుంద మనసులో ఏముందో తెలుకోవాలని ప్లాన్ చేసిన కృష్ణ.. ముందే పంతులుతో ఆదర్శ్, ముకుందలకు మాత్రమే ముహూర్తం పెట్టమని చెబుతుంది. కృష్ణ చెప్పినట్లుగానే ముకుంద- ఆదర్శ్ జంటకు రేపు మంచి ముహూర్తం ఉందని చెప్తాడు పంతులు. శోభనం రేపే అని తెలియగానే షాక్ అవుతుంది ముకుంద. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

Advertisment
Advertisment
తాజా కథనాలు