Krishna Mukunda Murari: అయోమయంగా కృష్ణ, మురారిల జీవితం .. ముకుంద ఏం చేయనుంది...!

కృష్ణను హాస్పిటల్ ఓపెనింగ్ కు తీసుకువెళ్లడం ఇష్టంలేని ముకుంద యాక్సిడెంట్ జరిగేలా చేస్తుంది. మరో వైపు కృష్ణకు ఎంత దగ్గరైతే తన ఆయుష్షు అంత తగ్గిపోతుంది అని మురారికి వార్నింగ్ ఇస్తుంది ముకుంద. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Krishna Mukunda Murari: అయోమయంగా  కృష్ణ, మురారిల జీవితం .. ముకుంద ఏం చేయనుంది...!

Krishna Mukunda Murari: కృష్ణ, మురారి హాస్పిటల్ ఓపెనింగ్ కోసమని బయలుదేరుతారు . మురారి కృష్ణతో వెళ్లడం ఇష్టంలేని ముకుంద.. వాళ్ళు బైక్ పై నుంచి కింద పడేలా చేస్తుంది. దీంతో మురారి టెన్షన్ పడతాడు. యాక్సిడెంట్ జరగడంతో హాస్పిటల్ ఓపెనింగ్ కు వెళ్లకూడదని నిర్ణయించుకుంటాడు మురారి.

publive-image
ఓపెనింగ్ కోసం రావట్లేదని హాస్పిటల్ కు ఫోన్ చేస్తాడు మురారి. అక్కడ ఫోన్ లిఫ్ట్ చేసిన ముకుంద.. కృష్ణకు నువ్వు ఎంత దగ్గరైతే తన ఆయుష్షు అంత తగ్గిపోతుంది. కృష్ణకు దూరమైపో అని మురారికి వార్నింగ్ ఇస్తుంది. హాస్పిటల్ లోని ఫోన్ ముకుంద లిఫ్ట్ చేయడంతో షాక్ అవుతాడు మురారి.
ముకుంద నిజంగానే దెయ్యమైందని భావిస్తాడు.

publive-image
కృష్ణ, మురారి ఇంటికి వస్తారు. ఓపెనింగ్ కోసమని వెళ్లిన కృష్ణ, మురారి ఇంతలోనే తిరిగి రావడంతో ఏమైందని ప్రశ్నిస్తుంది రేవతి. దీంతో యాక్సిడెంట్ విషయం గురించి చెప్తారు. ఇది వినగానే ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు.

publive-image

ఇంతలో అక్కడికి వచ్చిన ఇలాంటి వాళ్లకు ఇలాగే జరుగుతుంది అని కృష్ణను నానా మాటలు అంటాడు. ఒకరి జీవితాలు నాశనం చేసినందుకు ఇలాగే జరగాలని కృష్ణను నిందిస్తాడు. దీంతో కృష్ణ బాధపడుతుంది.

publive-image
మరో వైపు మురారి ప్రేమను పొందడానికి రూపం మార్చుకోవాలని నిర్ణయించుకున్న ముకుంద దాని కోసం హాస్పిటల్ కు వెళ్తుంది. తన రూపం మార్చాలని డాక్టర్స్ కు చెప్తుంది.

publive-image
ముకుంద చనిపోయిందని నమ్ముతున్న ఇంటి సభ్యులు ఆమె ఆత్మ శాంతించాలని పదిరోజుల కార్యం నిర్వహిస్తారు. తన భార్య చావుకు కారణం కృష్ణే అని భావిస్తున్న ఆదర్శ్ మళ్ళీ ఆమె పై అసహ్యం ప్రదర్శిస్తాడు. కృష్ణ ఆ కార్యక్రమంలో ఉండడం ఇష్టంలేని ఆదర్శ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Brahmamudi Serial: కావ్య, రాజ్ పెళ్లి వేడుకల్లో ఊహించని ట్విస్ట్ .. షాక్ లో దుగ్గిరాల కుటుంబం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు