టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తరచూ వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత నుంచి హాట్ టాపిక్ అవుతుంది. ఒకనొక సమయంలో ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. చైతుతో విడాకుల అనంతరం మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో కొట్టిమిట్టాడారు. దీని కారణంగా ఎన్నో నెలలు సినిమాలకు దూరమయ్యారు. ఇక ఇప్పుడిప్పుడే సామ్ మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారు.
ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి
డేటింగ్ రూమర్స్
పలు సినిమాలను లైన్‌లో పెట్టారు. మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సామ్ పెళ్లిపై పలు రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోర్‌తో సామ్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికీ ఓ బలమైన కారణం ఉంది. గతంలో సామ్- రాజ్ కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకుని పికిల్ బాల్ టోర్నమెంట్‌లో కనిపించారు.
ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు
అప్పటి నుంచి సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. అలాగే సమంత సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆమెను అవార్డ్‌తో సత్కరించారు. ఈ వేడుకల్లో రాజ్ నిడిమోరు సైతం సందడి చేశాడు. సమంతతో కలిసి ఒకే వేదికపై దర్శనమిచ్చాడు. ఇవేగాక బర్త్ డే పార్టీలు, మ్యారేజ్ వేడుకలు సహా మరెన్నో ఈవెంట్లలో ఈ జంట కలిసి దర్శనమిచ్చింది. దీంతో వీరిద్దరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై సమంత గాని.. రాజ్ నిడిమోర్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
త్వరలో పెళ్లి
ఈ క్రమంలోనే తాజాగా మరో వార్త నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. సమంత త్వరలో మ్యారేజ్ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. త్వరలో ఆమె పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. గత-- కొంతకాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉన్న సామ్ మరికొద్ది రోజుల్లోనే అతడి వివాహమాడనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
రాజ్ స్వస్థలం
ఇదిలా ఉంటే రాజ్ నిడిమోరు దర్శకుడిగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు. అతడు డి2ఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, గన్స్ & గులాబ్స్ సిరీస్‌లు నిర్మించాడు. రాజ్ నిడిమోరు స్వస్థలం ఏపీలోని తిరుపతి. కాగా సామ్, రాజ్‌కు మధ్య - ఫ్యామిలీ మ్యాన్ -2 వెబ్ సిరీస్ నుంచి స్నేహం చిగురించింది. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. దీంతో-- కొంతకాలంగా ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. త్వరలోనే మ్యారేజ్ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇక-- సమంతతో విడిపోయాక ఇటీవలే నాగచైతన్య శోభితను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
(samantha | samantha - raj nidimoru | raj-nidimoru | latest-telugu-news | telugu-news)