యాప్ పేరిట ఘరానా మోసం.... రూ. 15 కోట్లకు కుచ్చు టోపి పెట్టిన మోసగాళ్లు...!

ఎన్టీఆర్ జిల్లాలో ఘరానా మోసం(cheating) చోటు చేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీం పట్నంలో ఆన్ లైన్ యాప్(online app) పేరిట ప్రజలను మోసగాళ్లు బురిడీ కొట్టించారు. కొండపల్లి(kondapalli)కి చెందిన వ్యక్తులకు మోసగాళ్లు ఏకంగా రూ. 15 కోట్లకు కుచ్చు టోపీ పెట్టారు. యాప్ సరిగా పని చేయక పోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితులు లబోదిబో మన్నారు. చివరకి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.

New Update

కొండపల్లికి చెందిన కృష్ణ అనే వ్యక్తి ప్రస్తుతం బెంగళూరులో వుంటున్నాడు. రాజు మాటలు నమ్మిన కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని కుటుంబాలు ఓ యాప్(maersk)లో పెట్టుబడులు పెట్టాయి. మొదట్లో వారం... వారం రూ. 1500 నుంచి రూ. 2000 వరకు బాగానే డ్రా అయ్యేవి. దీంతో బాధితులు రూ. 40,000, లక్ష రూపాయలు ఇలా పెట్టుబడులు పెంచుతూ పోయారు.

ఒకే కుటుంబంలో నలుగురి పేరుతో యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. భార్య పుస్తెలు తాకట్టు పెట్టి ఒకరు... జీవనాధారమైన ఆటోను అమ్మి మరొకరు.... కాయ కష్టం చేసి మరికొందరు ఇలా లక్షలు యాప్ లో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత యాప్ పూర్తిగా పని చేయలేదు. దీంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. వెంటనే తమతో పెట్టుబడులు పెట్టించిన కృష్ణకు ఫోన్ చేశారు.

కానీ అప్పటికే కృష్ణ ఫోన్ స్విచ్ ఆప్ చేశాడు. దీంతో బాధితులు ఆందోళన చెందారు. బాధితులు వాడుతున్న యాప్‌లో ఆ కంపెనీ పేరు ఉండటాన్ని బాధితులు గమనించారు. రహదారిపై వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం పై ఆ కంపెనీ పేరును బాధితులు గుర్తించారు. కంటైనర్ లారీని అడ్డగించి డ్రైవర్ ను బాధితులు నిలదీశారు. డ్రైవర్ ను పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: తాగుబోతు భర్తకు డిఫరెంట్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన భార్య

Advertisment
Advertisment
తాజా కథనాలు