AP Politics: పవన్ కళ్యాణ్‌తో కొణతాల భేటీ.. ఈ అంశంపైనే చర్చ !! జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బుధవారం 17న హైదరాబాద్లో పవన్ ను కలిసిన కొణతాల ఏపిలో ప్రస్తుత రాజకీయాలపై, అలాగే ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాలపై సుమారుగా గంటకుపైగా చర్చలు జరిపారు. By Nedunuri Srinivas 18 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ New Update షేర్ చేయండి AP Politics:ఏపిలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైమ్లో నేతలు పార్టీలు మారుతుండటం సహజం. ఈ నేపథ్యం లో సీనియర్ నేత మంత్రి అయిన కొణతాల రామకృష్ణ జనసేనానితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.రాబోయే ఎన్నికలలో ఉత్తరాంధ్రలో పార్టీ బలబలాలపై కూడా చర్చించినట్లు సమాచారం. జనసేనలో చేరికపై క్లారిటీ త్వరలోనే జనసేనలో చేరనున్నట్లు కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లి ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసే ఆలోచనలో కొణతాల రామకృష్ణ ఉన్నట్లు సమాచారం. మంచిరోజు చూసుకొని ఈ నెలలోనే జనసేనలో చేరతానని కొణతాల రామకృష్ణ తెలిపారు. ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడుగా పేరున్న కొణతాల రామకృష్ణ కు రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది. బీసీ సామాజికవర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చలా కీలకమైన వ్యక్తే అని చెప్పాలి .వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొణతాల రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు. అపార అనుభవం ఉన్న నేత •1989 నుండి 1996 వరకు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడుగా పనిచేశారు. • 1991 నుండి 1996 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల కన్వీనర్‌గా కొణతాల రామకృష్ణ పనిచేశారు. • 2004 నుండి 2009 వరకు డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, న్యాయ తదితర శాఖలకు మంత్రిగా కొణతాల రామకృష్ణ పనిచేశారు. • దివంగత నేత డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం వైఎస్‌ఆర్‌సిపి లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటి చైర్మన్‌గా పనిచేశారు. • 2014 ఎన్నికల అనంతరం వైఎస్‌ఆర్‌సిపి కి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతున్నారు. • ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున ఆ ప్రాంతం సమస్యలపై సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. • విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్కాకేజీ ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉత్తరాంధ్రలో, ఢల్లీిలో అనేక ఉద్యమాలు కొణతాల రామకృష్ణ నిర్వహించారు. • వెనుకడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కొణతాల రామకృష్ణ రాష్ట్ర హైకోర్టులో పిల్ ను దాఖలు చేశారు. 2014తరువాత రాజకీయాలకు దూరం.. అయినా సమస్యలపై ఉక్కుపాదం కాంగ్రెస్‌లో కొణతాల రామకృష్ణ సీనియర్ నేతగా ఎదిగిన కొణతాల వైసీపీ ఆవిర్భావంలో జగన్‌కి అండగా నిలిచారు. 2014 ఎన్నికలలో వైసీపీ తరుపున పోటీ చేసి అపజయం పాలయిన కొణతాల , ఆ తరువాత వైసీపీ కి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే .. ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు. రాజేకేయ పార్టీలతో ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసాడు. ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ ఇవ్వాలనే విషయంలో చాలా పెద్ద పోరాటమే చేసారు కొణతాల. అంతటి అపారమైన అనుభవం ఉన్న నేత జనసేన పార్టీ లో చేరడం నిజంగా జనసైనికులకు, పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ALSO READ:6 గ్యారంటీల దరఖాస్తుల డేటా ఎంట్రీకి ముగిసిన గడువు.. ఆ జిల్లాల్లో మాత్రం ఇంకా నో! #pawan-kalyan #janasena #konathaala-ramakrishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి