కోనసీమ సింగం ఎస్పీ సుదీర్ కుమార్‌రెడ్డికి ఊహించని వీడ్కోలు

ఆ ఎస్పీ అంటే పోలీస్ సిబ్బందికి ఎనలేని ప్రేమ..గౌరవం. కర్ణాటక సింగం, కోనసీమ సింగంగా ఆ ఎస్పీకి పేరు. తూర్పుగోదావరి జిల్లాలోని సంక్రాంతి పండుగలో కోనసీమలో కోడిపందాలు ఆడకుండా చేసి సీమ చరిత్రను తిరగరాసిన ఎస్పీ సుదీర్ కుమార్ రెడ్డికి ఊహించని విధంగా బైక్ ర్యాలీతో వీడ్కోలు పలికిన రాజమండ్రి పోలీసులు.

New Update
కోనసీమ సింగం ఎస్పీ సుదీర్ కుమార్‌రెడ్డికి ఊహించని వీడ్కోలు

తూర్పు గోదావరి జిల్లా: ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్‌రెడ్డి బదిలీపై కర్ణాటక రాష్ట్రానికి వెళ్తున్న సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఘన వీడ్కోలు పలికారు. నూతనంగా ఏర్పడిన ఉమ్మడి జిల్లా చరిత్రలో ఎస్పీగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న అధికారికి ఈ విధమైన ఘన వీడ్కోలు మొట్టమొదటిసారి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో చోటుచేసుకుంది. మొదట జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్‌రెడ్డి బదిలీపై ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక క్యాడర్‌కు చెందిన 2010 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సుధీర్ కుమార్‌రెడ్డి.. గత మూడేళ్లుగా డిప్యూటేషన్‌పై ఏపీలో పనిచేస్తున్నారు.

కోనసీమ సింగం: ఆయన.. మొదట పొడుగింపు ఉత్తర్వులు రాకుంటే తిరిగి కర్ణాటకకు వెళ్లాల్సిన ఎస్పీ సుధీర్ కుమార్‌రెడ్డినీ కేంద్రం ఇప్పటికే రెండుసార్లు డిప్యూటేషన్ పొడిగింపు అభ్యర్థనను తిరస్కరించింది. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్‌రెడ్డి రాజమండ్రిలోనే కొనసాగాలనుకున్నారు చాలామంది పోలీస్ సిబ్బంది. అయితే కర్ణాటకలో పని చేసినప్పుడు సింగం పోలీస్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ కుమార్‌రెడ్డి తర్వాత కోనసీమ జిల్లాలో పనిచేసినప్పుడు కోనసీమ సింగంగా పేరు తెచ్చుకున్నారు.

పోలీస్‌ సబ్బందిలో నిరాశ: జిల్లాలో పనిచేసిన అన్ని రోజులు కేవలం ఎస్పీ కార్యాలయంలోనే వుంటూ పోలీసు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. కోడిపందాలకు పేరు గాంచిన కోనసీమలో సంక్రాంతి పండుగకు జరిగే కోడిపందాలు, జూద క్రీడలు ఆడకుండా కోనసీమ చరిత్రనే తీరగరశారు ఎస్పీ. గంజాయి ఇతర కేసుల్లో కూడా అదే సింగం పేరు తెచ్చుకున్నారు. దక్షిణ కర్ణాటకలో అల్లర్లను సమర్థవంతంగా అణిచివేసిన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి మంచి పేరు ఉంది. గతంలో సుధీర్ కుమార్ రెడ్డి బదిలీ సమయంలో నిలుపుదల చేయాలంటూ ఆందోళన చేశారు దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు.. బదిలీల్లో భాగంగా కోనసీమ జిల్లా తర్వాత రాజమండ్రి వచ్చిన ఎస్పీ బ్లేడ్ బ్యాచ్‌పై ఉక్కు పాదం మోపి ప్రజల్లో మన్నన్న పొందారు. డిప్యూటేషన్ ఉత్తర్వుల్లో మళ్లీ కొనసాగుతారనుకున్నా జిల్లా పోలీస్ సిబ్బందికి నిరాశ ఎదురైంది. దీంతో ఎవరూ ఊహించని స్థాయిలో ఆయనకు వీడ్కోలు పలికారు జిల్లా పోలీస్ యంత్రాంగం.

Advertisment
Advertisment
తాజా కథనాలు