Malavika Mohanan : మేకప్ వేసుకోవడానికే అన్ని గంటలు, ఒంటిపై దద్దుర్లు కూడా.. 'తంగలాన్' షూటింగ్ లో హీరోయిన్ కష్టాలు..! హీరోయిన్ మాళవిక మోహనన్ తాజా ప్రెస్ మీట్ లో ‘తంగలాన్’ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.' సినిమా కోసం మేకప్ వేసుకోవడానికే నాలుగు గంటల సమయం పట్టేది. ఎక్కువగా ఎండలోనే షూటింగ్ చేశాం. దాని కారణంగా నా శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయని' పేర్కొంది. By Anil Kumar 24 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Kollywood Actress Malavika Mohanan : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘తంగలాన్’. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కబాలి’ మూవీ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహన్, పార్వతి తిరువొతూ హీరోయిన్స్ గా నటించారు. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం లేటెస్ట్ గా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో హీరోయిన్ మాళవిక మోహనన్ తన పాత్ర గురించి, సెట్ లోని అనుభవాలు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు." తంగలాన్ నా జీవితంలో మర్చిపోలేని సినిమా. ఈ చిత్రంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా కోసం నాకు చాలా గంటల పాటు మేకప్ వేయాల్సి వచ్చింది. ఉదయం 6 గంటలకు మొదలై 10 గంటలకు అయిపోయింది. Also Read : నాకు ఆ సమస్య ఉంది.. దాని వల్ల ఓ రోజు షూటింగ్ లో ఊపిరి ఆడక.. : సందీప్ కిషన్ మేకప్ వేసుకోవడానికే దాదాపు నాలుగు గంటల సమయం పట్టేది. చాలా ఓపికగా కూర్చోవాల్సి వచ్చింది. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎక్కువగా ఎండలోనే షూటింగ్ చేశాం. దాని కారణంగా నా శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రోజూ సెట్స్‌లో డెర్మటాలజిస్ట్, కళ్ల డాక్టర్.. ఇలా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉండేవారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని పేర్కొంది. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. #thangalaan-movie #actress-malavika-mohanan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి