Vikram : 'తంగలాన్' కోసం విక్రమ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

'తంగలాన్' సినిమాకి విక్రమ్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి కోలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమా కోసం విక్రమ్ సుమారు రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కాగా నేడు థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

New Update
Vikram : 'తంగలాన్' కోసం విక్రమ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Kollywood Actor Vikram : తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చియాన్ విక్రమ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్' నేడు (ఆగస్టు 15) న విడుదలైన సంగతి తెలిసిందే. తమిళనాట ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా విక్రమ్ నటన, ఆయన కనిపించిన తీరు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

విక్రమ్ తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విధమైన పాత్రలో కనిపించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం విక్రమ్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి కోలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దాని ప్రకారం 'తంగలాన్' కోసం విక్రమ్ సుమారు రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : శివకార్తికేయన్ ‘అమరన్‌’ మేకింగ్ వీడియో..!

పా. రంజిత్ దర్శకత్వంల వహించిన ఈ సినిమా కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మాళవిక మోహనన్ పార్వతి తిరువోతు హీరోయిన్స్ గా నటించగా.. కలైరాణి, రంజిత్ జయకోడి వంటి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలు పోషించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు