SJ Surya : 'సరిపోదా శనివారం' స్టోరీ లీక్ చేసిన SJ సూర్య.. మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్న ఫ్యాన్స్..! ఎస్జే సూర్య ఇటీవల 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్‌లో నాని పాత్ర గురించి రివీల్ చేశారు. నాని పాత్ర చిన్నప్పటి నుంచి కోపం వచ్చే సమస్యతో బాధపడుతుంది. వాళ్ళ అమ్మ ఆ కోపాన్ని ఆదివారం నుంచి శుక్రవారం వరకు కంట్రోల్ చేసుకోవాలని చెప్తుందని, అదే మెయిన్ కాన్సెప్ట్ అన్నారు.. By Anil Kumar 08 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Kollywood Actor SJ Surya : నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న హైలీ ఎంటర్టైనర్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను ఎస్జే సూర్య వెల్లడించారు. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఎస్జే సూర్య, నాని పాత్ర గురించి మాట్లాడుతూ.." నాని పాత్ర చిన్నప్పటి నుంచి కోపం వచ్చే సమస్యతో బాధపడుతుంది. అతని అమ్మ ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి నానికి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్లాన్ సెట్ చేస్తుంది. అయితే శనివారానికి మాత్రం నాని మినహాయింపు తీసుకుంటాడు. మరి శనివారం ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చేసుకుంటాయనే నేపథ్యంలో 'సరిపోదా శనివారం' కాన్సెప్ట్‌తో సాగుతుంది. దాంతో పాటూ ఓ ట్విస్ట్ కూడా ఉంటుంది" అని చెప్పారు. Also Read : అక్కినేని నాగచైతన్య- శోభిత దూళిపాళ నిశ్చితార్థం-live ఈ కామెంట్స్ తో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదని, మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ నెట్టింట వరుస పోస్టులు పెడుతున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29 న రిలీజ్ కానుంది. #kollywood-actor-sj-surya #saripodhaa-sanivaaram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి