Upasana Konidela : ఇదేనా స్వాతంత్య్రం..? కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యపై ఉపాసన ఆవేదన! కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన ఇదన్నారు. సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతున్నప్పుడు మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాము? అని ప్రశ్నించారు. By Archana 15 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Upasana Konidela Emotional About Kolkata Trainee Doctor : ఇటీవలే కోలకతా (Kolkata) లో ఓ జూనియర్ డాక్టర్ (Trainee Doctor) పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను కలచివేసింది. మనిషికి ప్రాణం పొసే ఒక డాక్టర్ కు ఇలా జరగడం అమానవీయం. ఇప్పటికే దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, వైద్య విద్యార్థులు, డాక్టార్లు ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. నిన్న అర్థరాత్రి దేశంలోని ప్రధాన నగరాన్నింటిలోనూ మహిళలు రోడ్ల పై నిరసన చేపట్టారు. స్వతంత్రం వచ్చిన అర్ధరాత్రి.. స్త్రీల స్వతంత్రం కోసం అని దీనిని అభివర్ణించారు. #jaihind pic.twitter.com/qZIp9ALwNe — Upasana Konidela (@upasanakonidela) August 15, 2024 కోలకతా డాక్టర్ ఘటన పై ఉపాసన పోస్ట్ అయితే తాజాగా ఈ ఘటన పై స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసన (Upasana) ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాసన తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. "మానవసత్వాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది. కొందరిలో కనీస మానవత్వం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతున్నప్పుడు మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాము అని ప్రశ్నించారు. దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలు వెన్నెముక. ఈ రంగంలో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. అంతేకాదు అధ్యయనాల ప్రకారం.. మహిళా హెల్త్ వర్కర్లే రోగులతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు ఆమె గుర్తు చేశారు. ప్రతి మహిళ భద్రత, గౌరవం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని అని తెలిపారు." Also Read: Kriti Sanon: అతనితో డేటింగ్ రూమర్స్ పై స్పందించిన కృతి - Rtvlive.com #upasana-konidela #kolkata-trainee-doctor-murder-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి