Kolkata High Court : అమ్మాయిలు ఆ విషయంలో కంట్రోల్‌లో ఉండాలి: కోల్‌కతా హైకోర్టు కౌమారదశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని కల్‌కత్తా హైకోర్టు తెలిపింది. కౌమారదశలో ఉన్న అబ్బాయిలు కూడా అమ్మాయిలు, మహిళల పట్ల హుందాగా వ్యవహరించాలని, వారి శరీర సౌష్టవాన్ని గౌరవించాలని హైకోర్టు అభిప్రాయపడింది. By Vijaya Nimma 19 Oct 2023 in నేషనల్ New Update షేర్ చేయండి రెండు నిమిషాల సుఖానికి ప్రాధాన్యం ఇవ్వడం కన్నా.. కౌమారదశలో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని కోల్‌కతా (Kolkata) హైకోర్టు (High Court) తెలిపింది. కౌమారదశలో ఉన్న అబ్బాయిలు కూడా అమ్మాయిలు, మహిళల పట్ల హుందాగా వ్యవహరించాలని, వారి శరీర సౌష్టవాన్ని గౌరవించాలని హైకోర్టు అభిప్రాయపడింది. మైనర్ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ఓ యువకుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. జస్టిస్ చిట్టా రంజన్ దాస్, పార్దసారధి సేన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. లైంగిక చర్యలో పాల్గొంటే 16 ఏళ్లు దాటిన అమ్మాయిలు, అబ్బాయిలు ఒకవేళ ఇష్టపూర్వకంగా లైంగిక చర్యలో పాల్గొంటే ఆ కేసులను నేరరహితం చేయాలని కోర్టు తెలిపింది. యవ్వన దశలో లైంగిక సంబంధాల (Sexual relations) ద్వారా కలిగే న్యాయపరమైన చిక్కులపై అవగాహన కల్పించేందుకు సమగ్రమైన లైంగిక విద్యను అందించాలని కోర్టు అభిప్రాయపడింది. లైంగిక పరమైన కోర్కెలు, వాంఛాలకు చెందిన కారణాలను కోర్టు తన తీర్పులో సవివరంగా వెల్లడించింది. ఇది కూడా చదవండి: ఏలూరులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు… ఆన్‌లైన్ పేరుతో టోకరా లాంటి లైంగిక హార్మోన్లను రిలీజ్ లైంగిక వాంఛ కలడానికి మన శరీరంలోని పిట్యుటరీ గ్రంధి కీలకమైందని, అది టెస్టెస్టరోన్ లాంటి లైంగిక హార్మోన్లను రిలీజ్ చేస్తుందని, ఆ గ్రంధిని అదుపులో పెట్టడం మన చేతుల్లో ఉందని, ఆ గ్రంధి ఆటోమెటిక్‌గా హార్మోన్లను రిలీజ్ చేయదని, చూడడం, వినడం, చదవడం వంటి చర్యలతో మనలో లైంగిక తృష్ణ కలుగుతుందని కోర్టు తెలిపింది. అంటే మన సొంత చర్యల వల్లే మనలో కోర్కెలు కలుగుతున్నాయని, అందుకే ఆ కోర్కెలను అదుపులో పెట్టుకోవాలని కోల్‌కతా హైకోర్టు తీర్పులో పేర్కొంది. యవ్వన దశలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు (Girls, boys) ఎలా ఉండాలన్న సూత్రాలను కూడా కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో కల్తీ పాల కలకలం..నూనె, ఉప్పుతో పాల తయారీ #kolkata-high-court #girls-should-control #sexual-urges మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి