/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kolikapudi-jpg.webp)
Kolikapudi Srinivasa Rao: కృష్ణా జలాల కోసం ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కొలిపూడి శ్రీనివాస్ రావు నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో వచ్చి పాల్గొన్నారు. నీటి సత్యాగ్రహ పాదయాత్రపై దిగొచ్చిన ప్రభుత్వం బకాయి పడ్డ కోటి 20 లక్షలు గాను నీళ్ల టాక్టర్ కాంట్రాక్టర్లకు 30 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో డీప్లాన్ నగర్ తండా వద్ద మూడు మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేశారని శ్రీనివాసరావు తెలిపారు.
Also Read: వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు.. మీ చేతకాని తనానికి ఇలా అడుగుతున్నారా? అంటూ ఫైర్
ఏ కొండూరు మండలం అడ్డరోడ్డు నుంచి మొదలైన నీటి సత్యాగ్రహ పాదయాత్ర దీప్తా నగర్ తండా వద్ద ముగిసిందని తెలిపారు. కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సురక్షితమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. రానున్నది టీడీపీ ప్రభుత్వం అని ఏ కొండూరు మండలంలోని తండాల్లో మంచినీటి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Also Read: మళ్లీ విచారణకు డుమ్మా కొట్టిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు
ప్రతిరోజు ప్రతి కుటుంబానికి సురక్షితమైన మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా పనిచేస్తామని శ్రీనివాసరావు అన్నారు. రాజకీయలతీతంగా ఈ ప్రాంత వాసులు అండగా ఉందామని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.