Kodi Pandalu : జోరుగా కోడిపందాలు..కోట్లల్లో బెట్టింగులు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని అనేక జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు కోట్లల్లో బెట్టింగులు కడుతున్నారు. మరోవైపు పందాలను కూడడానికి భారీగా జనం తరలివస్తున్నారు. By Madhukar Vydhyula 15 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Ap : ఏపీలో కోడిపందాల జోరు కొనసాగుతోంది. నిర్వహకులు కొబ్బరికాయలు కొట్టి మరి బరులను ప్రారంభించారు. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతుంటే, పందెం రాయుళ్లు కోట్లల్లో డబ్బులు బెట్టింగ్ కడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతోపాటు, ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాలకు కూడా కోడిపందాల జోరు పాకింది. ఇక బరుల వద్ద హైటెక్ హంగులతో కోడి పందాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పందాలు చూసేందుకు తరలి వచ్చే జనం కోసం ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు నిర్వాహకులు. నారాయణపురంలో పందెం బరి దగ్గర వెయ్యి రూపాయల కూపన్ కొంటే లాటరీలో రెండు బైకులు గెలుచుకునే ఆఫర్ ఏర్పాటు చేశారు. దీంతో పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున కూపన్లు కొనుగోలు చేస్తున్నారు. పందెలు చూడడానికి వచ్చేవారికి సైతం టికెట్లు నిర్ణయించి విక్రయిస్తుండటంతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. పందాలకు ఉత్సవాలను తలపించేలా ఎల్ఈడీ స్క్రీన్లు, యాంకర్ల ను కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఈ పందెలను చూసేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు క్యూ కడుతున్నారు. ఇక బరుల వద్ద తెలంగాణ మద్యం ఏరులై పారుతోంది. తెలంగాణ నుంచి తెప్పించిన మద్యాన్ని పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. కోడి పందాలు చూసేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. జాతరను తలపించే విధంగా కోడిపందాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఫుడ్ కోర్టులు, మద్యం, సిగరేట్లు. తినుబండారాల స్టాల్స్ విరివిగా వెలిశాయి. మరోవైపు కోడిపందెలతో పాటు పేకాట, గుండాట వంటి ఆటలు కూడా జోరుగా సాగుతున్నాయి. పందాలను చూడడానికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ పేరుతో కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. కోడిపందాలు నిర్వహించటం చట్టపరంగా నేరమైనప్పటికీ సంప్రదాయంలో భాగంగా కోడి పందాలు అడుతున్నామని పందెంరాయుళ్లు వాదిస్తున్నారు. బరుల వద్ద వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే రాజకీయ ఒత్తిళ్ల వల్లే పందాలను అడ్డుకోలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. పందాలు జరుగుతున్న ప్రాంతాలకు మీడియాను అనుమతించటం లేదు. #andra-pradesh #makar-sankranti-2024 #kodi-pandalu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి