AP: మగాడివైతే నా ఛాలెంజ్ స్వీకరించు.. చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

చంద్రబాబుపై వైసీపీ నాయకుడు కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభను ఉద్దేశిస్తూ టీడీపీ వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడని విమర్శించారు. పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని నాని సవాల్ విసిరారు.

New Update
AP: మగాడివైతే నా ఛాలెంజ్ స్వీకరించు.. చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. నేడు కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభను ఉద్దేశిస్తూ మాట్లాడిన నాని.. టీడీపీ వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడని అన్నారు.

సొల్లు నాయుడు..
వైసీపీ పాలనలో వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారనడం హస్యాస్పదంగా ఉందన్నారు. గుడివాడలో వైకాపా గంజాయి మొక్కలను ఏరేస్తామనే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాని.. తనపై,సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్లిపోయాడన్నారు. సీఎంలుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో ఇళ్ల స్థలాలు, నీటి అవసరాలకు 6 వందల ఎకరాల భూసేకరణ చేశారు. 14ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా. ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ చేశారు.

మగాడివైతే నా సవాల్ స్వీకరించు.. 
అలాగే చంద్రబాబు మగాడివైతే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. తాను ప్రజలకోసం చావటానికైన సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడనన్నారు. గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవ్వరూ నమ్మరు. నేను గుడివాడ ముద్దు బిడ్డను. నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది. మరో నాలుగేళ్లు గెలుస్తా. చంద్రబాబు పార్టీని ఎన్ని సార్లు గెలిపించారు. తెలంగాణలో పార్టీని బూ స్థాపితం చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు. 5 వేల కుర్చీలు వేసి పది నియోజకవర్గాల నుంచి మనుషులని రప్పించి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి : Ayodhya : అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె

ఎన్టీఆర్ పైకి బాలయ్యను వదిలాడు..
అంతేకాదు లోకేష్ కు అడ్డు వస్తాడనే జూనియర్ ఎన్టీఆర్ పైకి, బాలయ్యను వదిలాడని ఆరోపించారు. లోకేష్ లాంటి కొడుకు శత్రువుకు కూడా ఉండకూడదని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కొన్న స్థలంలో, టిడ్కో ఫ్లాట్ల పునాదులు వేసి చంద్రబాబు వదిలేసాడని, కనీసం కాంట్రాక్టర్ కు డబ్బు కూడా చెల్లించలేదన్నాడు నాని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి, పూర్తి స్థాయి అభివృద్ధి చేసిన లబ్ది దారులకు అప్పగించిన ఘనత సీఎం జగన్ ది అని పొగిడారు.

బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి..
ఇక 75ఏళ్లు వచ్చి కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడన్న మాజీ మంత్రి.. ఎన్టీఆర్ గంజాయి మొక్క అని చెప్పి, సీఎం పదవి దోచుకున్న రోజులను ఎవ్వరూ మర్చిపోరని గుర్తు చేశారు. కాంగ్రెస్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న చంద్రబాబు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, మరదలిని చంపి, తమ్ముడిని పిచ్చొడిని చేసిన దుర్మార్గుడు చంద్రబాబుకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే కోతల కోటాలో చంద్రబాబుకు వచ్చిందా అంటూ దుయ్యబట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment