గతకొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని రక్షిస్తా.. హిందూ ఆలయాలపై దాడిని ఖండిస్తా అంటూ హల్ ఛల్ చేసిన అఘోరీ మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. తను ఒక స్త్రీగా చెప్పుకొని తిరుగుతూ.. అందులోనూ లేడీ అఘోరీగా ఫేమస్ అయిన అల్లురి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. శ్రీవర్షణి అనే యువతిని లేడీ అఘోరీ పెళ్లి చేసుకుంది. తనకు ఎలాంటి సెక్సువల్ ఫీలింగ్స్ లేవంటూ అల్లూరి శ్రీనివాస్ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. సాధువు అంటేనే అన్నింటిని త్యజించడం.. కానీ ఇక్కడ నాగసాధువుగా చెప్పుకొనే అల్లూరి శ్రీనివాస్ ప్రేమ, పెళ్లి అంటూ తిరుగుతున్నాడు.
పుట్టుకతో పురుషుడైన శ్రీనివాస్ లింగమార్పిడి ఆపరేషన్ చేసుకున్నాడు. తర్వాత సాధువుగా మారి సన్యాసం తీసుకున్నాడు. 12 సంవత్సరాలు కఠోర దీక్ష చేశానని, నిత్యం శివనామ స్మరణ చేస్తానని అల్లూరి శ్రీనివాస్ అందరితో చెప్పాడు. అయితే ఇప్పుడు మాత్రం ఓ యువతి చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు లేక నేను లేను అంటూ ఆమెతో కలిసి దేవాలయాలకు వెళ్తున్నాడు. మా అమ్మాయిపై వసీకరణ చేసి తనతో వెళ్లిపోయేట్లు చేశాడని శ్రీవర్షణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 20రోజుల క్రితం శ్రీవర్షిణి అఘోరీతో వెళ్లింది. శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు ఆమెను అఘోరి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదని.. అఘోరీ అమ్మతోనే వెళ్లిపోతానని శ్రీవర్షణీ అంటోంది. మళ్లీ ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. ఈసారి అఘోరీతో వెళ్లి మధ్య ప్రదేశ్‌లో పెళ్లి కూడా చేసుకుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం గుడిలో అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరీ శ్రీవర్షణిని పెళ్లి చేసుకున్నారు. అసలు చట్టప్రకారం వారి పెళ్లి చెల్లుతుందా? అఘోరీ అనే విషయం పక్కన పెడితే అల్లూరి శ్రీనివాస్ ట్రాన్స్‌జెండర్, అయితే ఓ ట్రాన్స్‌జెండర్ స్త్రీని వివాహం చేసుకోవచ్చా..? అనే ప్రశ్న చాలామంది మైండ్‌లో తిరుగుతుంది.
భారతదేశంలో 2023 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. భిన్న లింగ సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చు. అంటే పుట్టుకతో వారికున్న లింగాన్ని మార్చుకొని ఇతరులను పెళ్లి చేసుకునే హక్కులు చట్టరీత్య ఉన్నాయి. కోర్టు ఈ తీర్పును ఒక లింగమార్పిడి పురుషుడు సిస్జెండర్ స్త్రీని వివాహం చేసుకోవచ్చు. అలాగే ఒక ట్రాన్స్‌జెండర్ స్త్రీని సిస్జెండర్ పురుషుడిని వివాహం చేసుకోవచ్చు. భిన్న లింగ సంబంధాలలో ఉన్న ట్రాన్స్‌జెండర్లు పర్సనల్ రైట్స్‌తోపాటు వివాహం చేసుకునే హక్కును కూడా కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు ధృవీకరించింది.
స్త్రీగా ఉన్న వర్షిణిని, స్త్రీగా మారిన ట్రాన్స్ జెండర్ అఘోరీ పెళ్లి చేసుకుంటే అది స్వలింగ వివాహం అవుతుంది. స్వలింగ వివాహంపై కోర్టు ఇప్పటివరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు, కానీ రాజ్యాంగం ప్రకారం LGBTQ+ పౌరుల హక్కులను గుర్తించింది. LGBTQ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి చట్టాలను రూపొందించడానికి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇచ్చింది. లింగమార్పిడి వ్యక్తుల చట్టం 2019 అని తయారు చేసింది. ఇందులో ట్రాన్స్‌జెండర్ల, సిస్జెండర్ల మధ్య వివాహాలు ప్రత్యేక వివాహ చట్టం మరియు వ్యక్తిగత చట్టాలతో సహా ప్రస్తుత చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతాయని కోర్టు పేర్కొంది. ఇందులో స్వలింగ వివాహం గురించి చెప్పలేదు. అంతేకాదు లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి స్త్రీని వివాహం చేసుకోవచ్చని కూడా చెప్పలేదు. కావున చట్ట ప్రకారం అఘోరీ పెళ్లి చెల్లదని కొందరు న్యాయ నిపుణులు అంటున్నారు. పురుషుడి భావాలు కలిగి ఉండి స్త్రీ అవతారంలో ఉన్న అల్లూరి శ్రీనివాస్ శ్రీవర్షిణిల వివాహం చట్ట విరుద్ధమని చెబుతున్నారు. అంతేకాదు.. ఇది వరకే అఘోరీ మరో ఇద్దర్ని పెళ్లి చేసుకుందని బాధితులు మీడియా ముందుకు వస్తున్నారు. అదే కనుక వాస్తవం అయితే.. లేడీ అఘోరీ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది.