Kodali Nani: పవన్ యుద్ధం కామెంట్స్ కు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఎక్కడ.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోండని జనసేనాని పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారు.. ఎక్కడ చేస్తారో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. By Jyoshna Sappogula 22 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Kodali Nani: పవన్ యుద్ధం కామెంట్స్ కు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పలు ప్రశ్నలు సంధిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ యుద్ధం చేస్తాడు? చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేస్తాడు? బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తుంది? అందరూ కలిసి యుద్ధం చేస్తారా? ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరు ఎక్కడ యుద్ధానికి రెడీయో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా? అని అడిగారు. Also Read: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ పవన్ ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ..ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు? చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు..ఎన్ని చోట్ల చేయబోతున్నాడు? బీజేపీ వీళ్లతో కలిసే యుద్ధం చేయబోతుందా ..విడిగా చేస్తుందా? కనీసం టీడీపీ, జనసేనలో టిక్కెట్లు ఆశించేవారికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. ఎక్కడ..ఎన్ని సీట్లలో పోటీచేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోండి? అని కామెంట్స్ చేశారు. తర్వాత యుద్ధం..సై..అనండి అని సూచించారు మాజీ మంత్రి కొడాలి నాని. జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో దూసుకెళ్తున్నాడని..మీరేమో యుద్ధం పేరుతో మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవ్వదు..కామెడీ పోస్ట్ అవుతుందని చురకలు వేశారు. Also Read: పోటీ చేయాలా? వద్దా?.. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు కాగా, ఏపీలో అతి తర్వలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అటు అధికార పార్టీ వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన ఎన్నికల ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ సిద్ధం అనే పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు టీడీపీ, జనసేన సైతం యుద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంలోకి వచ్చేది మనమే.. వైసీపీ ఓడిపోతుందని టీడీపీ , జనసేన దీమా వ్యక్తం చేస్తున్నాయి. #andhra-pradesh #kodali-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి