అగంతకుడి కత్తి దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి..9మందికి తీవ్ర గాయాలు! ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో డ్యాన్స్ స్కూల్లోకి ఓ 17 ఏళ్ల అగంతకుడు ప్రవేశించి అక్కడున్న చిన్నారులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడకక్కడే మృతి చెందగా.. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. By Durga Rao 31 Jul 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్ హార్ట్ స్ట్రీట్ ఓ తీరప్రాంత పట్టణం, ఇక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ ఉంది.ఈ డ్యాన్స్ స్కూల్ కు పెద్ద సంఖ్యలో పిల్లలు శిక్షణ పొందుతున్నారు.అయితే ఈ రోజు ఉదయం డ్యాన్స్ ట్రైనింగ్ స్కూల్లోకి ప్రవేశించిన 17 ఏళ్ల బాలుడు అక్కడున్న చిన్నారులపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఇది చూసిన కొందరు ఆ యువకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.ఈ ఘటనలో ఇద్దరు బాలురు మృతి చెందగా.. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన ఇంగ్లండ్‌ను కలచివేసింది. కత్తిపోట్లపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి కి చేరుకునని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. #knife-attack-in-england మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి