మా పోరాటం కాంగ్రెస్ కు కలిసొచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై కిషన్ రెడ్డి స్పందించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని.. ఇప్పుడు కూడా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్దఎత్తున డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాయని ఆరోపించారు. By V.J Reddy 04 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kishan Reddy: తెలంగాణలో బీజేపీ ఓటమిపై స్పందించారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తునట్లు తెలిపారు. అనుకున్న దానికంటే సీట్లు తగ్గాయని.. పార్టీ ముఖ్యనేతలు ఓడిపోవడం బాధ కలిగించిందని అన్నారు. ALSO READ: BIG BREAKING: రాత్రి 7 గంటలకు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం ఎన్నికల ఫలితాలలో బీజేపీ (BJP) ఎనిమిది స్థానాలలో విజయం సాధించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 14శాతం ఓటు బ్యాంకును కైవసం చేసుకున్నామని అన్నారు. శాసనసభ గత ఎన్నికలతో పోలిస్తే వంద శాతం ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలిపారు. తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. బీఆర్ఎస్ (BRS) సర్కారు వైఫల్యాలపై అనేక పోరాటాలు చేసినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్దఎత్తున డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటేసిన ... పార్టీలకు అతీతంగా పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ కే ఓటు వేస్తామని తెలంగాణ ప్రజలు అంటున్నారని అన్నారు. ఎన్నికల ఫలితాలు నిరాశ పర్చిన పోరాడుతూనే ఉంటామని తెలిపారు. లక్ష్యం కోసం ముందుకి వెళ్తాం తప్ప.. తగ్గేది లేదని అన్నారు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. ALSO READ: డిప్యూటీ సీఎం పదవి రేసులో ఆరుగురు అగ్ర నేతలు.. ఎవరో తెలుసా..? తమ మీద ఏడ్చి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు ఫార్మ్ హౌస్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన ఐదేళ్లు అనేక పోరాటాలు చేశామని పేర్కొన్నారు. తమ పోరాటం వల్ల కాంగ్రెస్ (Congress) కి లాభం చేకూరిందని అన్నారు. తాను ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. ఇక్కడున్న పరిస్థితులు ఎన్నికల ఫలితాల గురించి హైకాండ్ కు వివరించనున్నట్లు తెలిపారు. #congress #telangana-elections-2023 #bjp-kishan-reddy #telangana-election-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి