AP: ఆ పదవికోసం నా కాళ్లు పట్టుకున్నాడు.. కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! DCC పదవికోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్ళు పట్టుకున్నాడని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. 'ఆయన నా కాళ్ళు పట్టుకున్నట్లు నేను ఏదేవుడి దగ్గరైన ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధమా పెద్దిరెడ్డి?' అంటూ సవాల్ విసిరారు. By srinivas 18 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Kiran kumar: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి.. పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికు మద్దతుగా కిరణ్ కుమార్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు DCC పదవికోసం పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్ళు పట్టుకున్నాడని చెప్పారు. అంతేకాదు మళ్ళీ తెల్లవారి వచ్చి రెండవ సారి కాళ్ళు పట్టుకొని నాకు DCC పదవీ ఇవ్వండని వేడుకున్నట్లు గుర్తు చేశారు. ప్రమాణం చేయడానికి సిద్ధం.. ఆయన నా కాళ్ళు పట్టుకున్నట్లు నేను ఏదేవుడి దగ్గరైన ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా పెద్దిరెడ్డి? అంటూ కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పారని అన్నారు. మంత్రి పదవితో జిల్లాలో ఇసుక, మైనింగ్, మట్టి, నాసి రకం మద్యం లాంటి అక్రమ సంపాదనకు ఆశపడి ప్రజలరక్తం తాగుతున్నాడు. ముఖ్యమంత్రి అవుతే ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి అన్నారు. ఇది కూడా చదవండి: Karnataka: కాలేజీ క్యాంపస్‌లో కార్పొరేటర్ కూతురు హత్య! అన్నీ కక్కిస్తాం.. అలాగే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు పరిసరాల్లో నాలుగు వందల కోట్ల రూపాయల భూములుఅన్యాక్రాంతం ఆయినట్లు తెలిపారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే అన్నీ కక్కిస్తామని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన ఎవ్వరికీ వదిలే పరిస్థితి లేదని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం చేరుకొని తమకుటుంబ సభ్యులతో ఎమ్మెల్లే అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారికి పత్రాలు అందించారు. నామినేషన్ వేయడానికి సహకరించిన టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, మహిళలు, నల్లారి అభిమానులకు కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. #kiran-kumar-reddy #ramachandra-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి