Salaar 2 : ప్రభాస్ సరసన 'గేమ్ ఛేంజర్' బ్యూటీ?

New Update
Salaar 2 : ప్రభాస్ సరసన 'గేమ్ ఛేంజర్' బ్యూటీ?

Kiara Advani : పాన్ ఇండియా హీరో ప్రభాస్ గత ఏడాది 'సలార్' సినిమాతో భారీ కం బ్యాక్ అందుకున్న విషయం తెలిసిందే.'కెజిఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లు కలెక్ట్ చేసింది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా 'సలార్' పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ముందే స్పష్టం చేశారు. 'సలార్' పార్ట్ -2 'శౌర్యంగ పర్వం' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రెజెంట్ 'కల్కి2898AD', 'రాజాసాబ్' షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ జూన్ లేదా జులై లో 'సలార్-2' సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మొదటి భాగం కంటే రెండో భాగంలో మరిన్ని అదనపు ఆకర్షణలను మేకర్స్ జోడించనున్నారని, ఇందులో భాగంగానే మూవీ టీమ్ తాజాగా సినిమాలో మరో హీరోయిన్ ని సెలెక్ట్ చేయడంపై ద్రుష్టి సారించినట్లు తాజా సమాచారం. 'సలార్' పార్ట్ -1 లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. 'సలార్-2' లోనూ ఆమె పాత్ర కీలకంగా ఉండబోతోందట. ఐతే పార్ట్-2 లో శృతి హాసన్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా నటించనుందట. సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'సలార్-2' లో కియారా ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుకుతోంది. 'సలార్' పార్ట్-1 లో ఐటెం సాంగ్ లేదని ఫ్యాన్స్ ఎంతో డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఈసారి అలా కాకుండా పార్ట్-2 లో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై పూర్తి స్పష్టత రానుంది. హోంబలె ఫిలిమ్స్ నిర్మిస్తున్నఈ సినిమా 2025 లో థియేటర్స్ లో సందడి చేయనుంది.

Also Read : తమన్నకు సమన్లు జారీ చేసిన మహారాష్ట్ర సైబర్ సెల్‌.. ఎందుకంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు