కార్లలో లోపం, అందుకే రీకాల్ చేస్తున్న కియా.. రీజన్ ఏంటంటే..? కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా ఇండియాలో పెద్ద ఎత్తున కార్లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. కర్సెన్ మోడల్ కార్లను సాంకేతిక కారణాలతో రీకాల్ చేస్తున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకు 30,279 కార్లను రీకాల్ చేసినట్లు తెలిపింది. అసలు రీజనేంటంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం మాత్రమే బ్యాక్ తీసుకుంటున్నట్లు కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆ సంస్ధ వారు తెలిపారు. By Shareef Pasha 28 Jun 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి కియా ఇండియాలో పెద్ద ఎత్తున కార్లను రీకాల్ చేయడం దేనికోసం అంటే.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం మాత్రమే కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు చెప్పింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య తయారైన యూనిట్లను వెనక్కి పిలిచినట్లు పేర్కొంది. రీకాల్ సమయలో క్లస్టర్ బూటింగ్ ప్రక్రియలో సమస్య ఉంటే.. దానిని గుర్తించి ఫ్రీగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయనున్నట్లు పేర్కొంది. లేకుంటే క్లస్టర్ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందని చెప్పారు. రీకాల్ ప్రక్రియలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని వినియోగదారులకు వ్యక్తిగత సమాచారం అదిస్తామని కియా పేర్కొంది. షెడ్యూల్ అపాయింట్‌మెంట్స్ కోసం డీలర్లను వినియోగదారులు సంప్రదించాలని సూచించింది. ఇదిలా ఉండగా.. కియా కర్సెన్ మోడల్‌ను రీకాల్ చేయడం ఇది రెండోసారి. కార్లు లాంచ్ అయిన మూడునెలల తర్వాత గతేడాది మే నెలలో కియా కరెన్స్ కార్లను రీకాల్ చేసింది. సాఫ్ట్‌వేర్ సంబంధిత సమస్యల కారణంగా గతేడాది నాలుగువేలకుపైగా కార్లను వెనక్కి పిలిచింది. ఈ ఏడాది మార్చిలో కియా ఓ మోడల్‌ను పెట్రోల్ ఇంజిన్ అప్‌డేట్ చేసింది. కర్సెన్ మోడల్‌లో 1.4-లీటర్ T-GDI మోటార్ స్థానంలో సరికొత్తగా 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానున్నది. అలాగే 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో పాటు 6-స్పీడ్ iMT గేర్‌బాక్స్‌ను పరిచయం చేసింది. కియా సెల్టోస్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అప్‌డేట్ చేసింది. ఇదిలా ఉండగా.. కొరియన్ దిగ్గజానికి చెందిన కార్లు భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్స్‌లో కర్సెన్ ఒకటి. మేలో దేశవ్యాప్తంగా 4,612 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కియా కర్సెన్‌లో కొత్త లగ్జరీ ఆప్షన్ వేరియంట్‌ను పరిచయం చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో ఆటోమెటిక్ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కియా కర్సెన్ ఎక్స్‌షోరూం ధర రూ.10.45లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ ఎండ్ వర్షన్ రూ.18.45లక్షల వరకు ఉంటుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి