Khammam: భద్రాద్రి జిల్లాలో మిస్టరీగా ప్రేమజంట ఆత్మహత్య ..డాక్టర్ మౌనిక ఫోన్‌లో ఏముంది? భద్రాద్రి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య మిస్టరీగా మారింది. సాయికుమార్, స్వప్న దంపతులకు డాక్టర్ మౌనికకు లింకేంటి? భార్యభర్తల సూసైడ్ కు డాక్టర్ మౌనిక కారణమా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 06 Oct 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Khammam Love Marriage: భద్రాద్రి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య మిస్టరీగా మారింది. సాయికుమార్, స్వప్న దంపతులకు డాక్టర్ మౌనికకు లింకేంటి? భార్యభర్తల సూసైడ్ కు డాక్టర్ మౌనిక కారణమా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యప్తు చేపట్టారు. స్వప్న, సాయికుమార్, డాక్టర్ మౌనికల ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆత్మహత్యకు ముందు స్వప్నకు డాక్టర్ మౌనిక నుంచి ఫోన్ వచ్చింది. ఆ వెంటనే స్వప్న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో డాక్టర్ మౌనిక స్వప్నతో ఫోన్‌లో ఏం చెప్పింది? తనతో ఫోన్ మాట్లాడిన వెంటనే స్వప్న ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వప్న, సాయికుమార్ మరణంతో కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. మడతనకుంట గ్రామంలో స్వప్న అంత్యక్రియలు జరిపిన కుటుంబ సభ్యులు..నేడు ఉప్పాకలో సాయికుమార్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ కేసులో కాల్ డేటా కీలకంగా మారినట్లు తెలుస్తుంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఉప్పాకలో ప్రేమపెళ్లి విషాదంగా ముగిసింది. 8 నెలల క్రితం పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నారు ఉప్పాక పంచాయతీకి చెందిన సాయికుమార్(Sai Kumar), స్వప్న(Swapna ). ఏడూళ్ల బయ్యారంలో 108 డ్రైవర్ గా పనిచేస్తున్నాడు సాయి కుమార్. మరోవైపు మణుగూరు బీటీపీఎస్ జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ గా స్వప్న విధులు నిర్వహించేది. 7 నెలల గర్భవతిగా ఉన్నప్పటికి స్వప్న విధులకు హాజరవుతుండేది. బుధవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన స్వప్న.. ఇంట్లో విగతాజీవిగా కనిపించింది. స్వప్న ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో, గర్భంలోనే ఏడునెలల శిశువు మృతి చెందింది. భార్య స్వప్న మరణం తెలుసుకున్న భర్త సాయికుమార్ మనస్ధాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్ధానికులు హుటాహుటిన సాయికుమార్ ను మణుగూరు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో మణుగూరు నుంచి భద్రాచలం అక్కడి నుండి ఖమ్మంకు తరలించారు. ఖమ్మంలోని మమతా ఆసుపత్రిలో సాయికుమార్ చికిత్స పొందుతు మృతి చెందాడు. అయితే, ఆత్మహత్యాయత్నానికి గల కారణాన్నితన ఎడమచేతిపై రాసుకున్నాడు సాయికుమార్!. నా చావుకి కారణం డాక్టర్ మౌనిక అని రాసుకున్నాడు. సాయికుమార్ ఆత్మహత్య ఘటన విషయంలో అసలు విషయం బయటకు రాకుండా కొందరు కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా సాయికుమార్ ఆత్మహత్యకు కారణం ఎడమచేతిపై రాసి ఉన్న పేరును చెరిపేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇందులో ఓప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. #khammam #swapna #sai-kumar-death-issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి