Kandula Durgesh: సూర్యప్రకాశ్ కు కందుల దుర్గేష్ వార్నింగ్.. జనసేన గురించి తప్పుగా మాట్లాడితే... జనసేన పార్టీలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉందన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్. వైసీపీలో చేరగానే జనసేనకు ప్రజాస్వామ్యం లేదని చేగొండి సూర్యప్రకాశ్ మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు. వైసీపీ ఆడే మైండ్ గేమ్ ట్రాప్ లో హరిరామ జోగయ్య కూడా పడిపోతున్నారని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 02 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Janasena Kandula Durgesh: జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్న సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ (Chegondi Suryaprakash) వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 సీట్లు తీసుకోవటం పై సూర్య ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తి చేస్తూ పార్టీ మారారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైఖరికి నిరసనగా సూర్య ప్రకాష్ పార్టీ మారుతున్నట్లు తెలిపారు. కాగా, హరిరామ జోగయ్య లేఖ, కొడుకు వైసీపీలో చేరికపై జనసేన పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్ స్పందించారు. ఇప్పటివరకు హరిరామ జోగయ్య (Harirama Jogaiah) తనయుడు తమకు సహచరుడిగా ఇప్పుడు తెర తీశారన్నారు. పార్టీలో ఉన్నంతకాలం బాగుందని చెప్పి ఇప్పుడు బాగోలేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జనసేనలో ఉన్నప్పుడు వైసీపీ గురించి ఏం మాట్లాడారో మీకే తెలుసని అన్నారు. పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత పార్టీ అంతర్గత విషయాలు.. పార్టీని దూషించే విధంగా మాట్లాడకూడదని ఎందుకు ఆలోచన చేయడం లేదని నిలదీశారు. Also Read: వైసీపీలోకి భూమా ఫ్యామిలీ.. భూమా అఖిలప్రియ Vs కిషోర్‌రెడ్డి జనసేన పార్టీలో (Janasena Party) సంపూర్ణమైన స్వేచ్ఛ ఉందన్నారు. వైసీపీలో చేరగానే జనసేనకు ప్రజాస్వామ్యం లేదని అని మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి మాటలు మాట్లాడటం సమంజసం కాదని హెచ్చరించారు. గతంలో జనసేన అభివృద్ధి అని చెప్పిన హరి రామ జోగయ్య ఇప్పుడు మాట మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. విద్యులైన హరిరామ జోగయ్య ఆలోచించి ముందుకు వెళ్ళండన్నారు. వైసీపీ ఆడే మైండ్ గేమ్ ట్రాప్ లో మీరు పడిపోతున్నారని కామెంట్స్ చేశారు. వైసీపీలో ప్రజాస్వామ్యం లేదు నియంతృత్వం మాత్రమే ఉందన్నారు. స్వయంగా ఈ మాట వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులే చెప్తున్నారన్నారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు నాయకులకే సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదని వ్యాఖ్యానించారు. హరి రామ జోగయ్య వ్యాఖ్యలను విజ్ఞులుగానే స్వీకరిస్తామన్నారు. అయితే, తనయుడు సూర్య ప్రకాష్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని తెలిపారు. #pawan-kalyan #janasena #harirama-jogaiah #kandula-durgesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి